Advertisement
Google Ads BL

పూరి కూడా ఓటిటీకే జై కొడుతున్నాడుగా!


ప్రస్తుతం థియేటర్స్ పరిస్థితి ఏం బాలేదు. కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్ మెల్లిగా తెరుచుకుంటున్నప్పటికీ... ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాలు విడుదల చేసేందుకు హీరోలు ఆలోచన చేస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, అక్కినేని హీరో సుమంత్ లు ధైర్యంగా డిసెంబర్ 25 క్రిస్మస్ కి తమ సినిమాల విడుదల అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియడం లేదు. అందుకే ఇప్పటికి చాలామంది ఓటిటి కే జై కొడుతున్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ హిట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఓటీటీకి జై కొడుతున్నట్టుగా ఫిలింనగర్ టాక్.

Advertisement
CJ Advs

అంటే విజయ్ దేవరకొండ తో పూరి తెరకెక్కిస్తున్న ఫైటర్ కోసం పూరి ఓటిటి కి జై కొట్టడం లేదు. తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం కోసం పూరి ఓటిటికి ఓకె చెబుతున్నాడట. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ షూటింగ్ ఫినిష్ అయ్యి చాలా కాలమే అయ్యింది. అయితే ఈ సినిమాలో ఆకాష్ పూరి - కేతిక శర్మ రొమాంటిక్ యాంగిల్స్ కాకపుట్టేంచేవిగా ఉడడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కాకపోతే ఇలాంటి సినిమా అంటే.. బోల్డ్ కంటెంట్ సినిమా థియేటర్ లో కన్నా ఓటిటిలోనే వర్కౌట్ అవుతుంది అని.. ZEE 5 వారు పూరి కి భారీ ఆఫర్ ఇచ్చారట. పూరి కూడా రొమాంటిక్ ని ఓటిటి ద్వారా విడుదల చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా టాక్ మొదలయ్యింది. 

Puri is also supporting OTT platforms!:

Puri Jagannadh Romantic choosing OTT platform Zee5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs