నితిన్ అండ్ కీర్తి సురేష్ లు రంగ్ దే షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లారు. కరోనా వలన ఆగిన దుబాయ్ షెడ్యూల్ ని తాజాగా గా ప్లాన్ చేసిన వెంకీ అట్లూరి.. నితిన్ అండ్ కీర్తి అండ్ టీం తో కలిసి దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు. దుబాయ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాడు. మరి రంగ్ దే టీం కేవలం షూటింగ్ కొసం మాత్రమే దుబాయ్ వెళ్ళలేదు. కరోనా తో ఇంట్లోనే ఉండి బోర్ కట్టిన నితిన్ అండ్ కీర్తిలు దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నితిన్ తన వైఫ్ శాలినితో దుబాయ్ లో సైట్ సీయింగ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో షాలిని ని పెళ్లాడిన నితిన్ హాని మూన్ కోసం ఎక్కడికి వెళ్లలేకపోయాడు కారణం కరోనా. అందుకే దుబాయ్ లో రంగ్ దే షూటిగ్ తో పాటుగా నితిన్ భార్యతో హానిమూన్ కూడా చేసుకుంటున్నాడు.
షూటింగ్ తోనూ, కరోనా లాక్ డౌన్ తోనూ అలిసిపోయిన కీర్తి కూడా.. నితిన్ మాత్రమే భార్య తో ఎంజాయ్ చేస్తాడా.. నేను మాత్రం తక్కువా అన్నట్టుగా తన గ్యాంగ్ తో దుబాయ్ న చుట్టేస్తోంది. రంగ్ దే షూటింగ్ ఓ పక్క , మరోపక్క కీర్తి సురేష్ తన ఫ్రెండ్ సర్కిల్స్ తో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. కీర్తి అండ్ గ్యాంగ్ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ ఫొటోస్ చూస్తుంటే నితిన్ భార్యతో దుబాయ్ లో తిరుగుతుంటే.. కీర్తి కూడా గ్యాంగ్ ని వేసుకుని దుబాయ్ చుట్టేస్తోంది అనిపించడం లేదూ.!