పవన్ కళ్యాణ్ సినిమాలు ఒప్పుకుంటున్నాడని.. పొలోమంటూ పవన్ కి కథలు వినిపించి ఓకె చేయించుకున్న దర్శకనిర్మాతలకు పవన్ ఎప్పుడు ఝలక్ ఇస్తాడో అని ఇప్పుడు టెంక్షన్ పడుతున్నారు వారు. పవన్ తో సినిమా ఓకె చేయిచుకున్నామనే ఆనందం దర్శకనిర్మాతల్లో ఆవిరైపోయేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. పింక్ రీమేక్.. తక్కువ బడ్జెట్, చిన్న సినిమా అయినా వకీల్ సాబ్ కే పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ చుక్కలు చూపిస్తున్నాడు. వకీల్ సాబ్ కి పవన్ డేట్స్ కూడా చాలా తక్కువే. కానీ ఇంతవరకు వకీల్ సాబ్ షూటింగ్ ని పవన్ ఫినిష్ చెయ్యకుండా రాజకీయాలంటూ నాన్చుతూనే ఉన్నాడు.
మరి వేణు శ్రీరామ్ కి వకీల్ సాబ్ షూటింగ్ కన్నా పవన్ కోసం వెయిటింగ్ ఎక్కువయ్యేలా కనబడుతుంది. చిన్న సినిమా వకీల్ సాబ్ పరిస్థితే ఇలా ఉంటే.. పవన్ తో భారీ బడ్జెట్ మూవీస్ చేసే దర్శకనిర్మాతల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి.. అమ్మో కాదు.. పాపం అనిపిస్తుంది. పవన్ తో సినిమాల మీద సినిమాలు ప్రకటించిన దర్శకులకు ఆయన రాజకీయాలతో ఇచ్చే ఝలక్ లకి ఎప్పుడో టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో రాజకీయాలంటూ ఇలాంటి బ్రేకులు తీసుకుంటే నిర్మాతలు నాశనం అవుతారు. దర్శకులు ఇరుక్కుంటారు. బయటికి పోలేరు.. అలాగని పవన్ రాడు. మరి ప్రస్తుతాం వేణు శ్రీరామ్ పరిస్థితి తమకి కూడా వస్తుందేమో అంటూ దర్శకుల వెన్నులో ఒణుకు మొదలయ్యిందట.