Advertisement
Google Ads BL

వినాయక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ!


వి.వి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో పెన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

Advertisement
CJ Advs

తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ మ‌రియు స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రైన బెల్ల‌కొండ సాయి శ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీకి స‌ర్వం సిద్ద‌మైంది. ఫస్ట్ మూవీ అల్లుడు శ్రీను నుంచి రాక్షసుడు వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ప్రతి సినిమా  హిందీలో డబ్అయ్యి  యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంటున్న నేపథ్యంలో పాపుల‌ర్ ఫిలిం మేక‌ర్ డా. జయంతిలాల్ గ‌డ‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని  బాలీవుడ్ లోకి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఛత్రపతి.  ఈ చిత్రం రీమేక్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు సాయి శ్రీనివాస్.  అల్లుడు శ్రీనుతో సాయిని టాలీవుడ్ కి  పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఇద్దరికీ ఇది తొలి హిందీ సినిమా కావడం విశేషం. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై డాక్టర్‌. జయంతిలాల్ గ‌డ‌ ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా..

పాపుల‌ర్ ఫిలిం మేక‌ర్  డాక్టర్‌. జయంతిలాల్ గ‌డ‌ మాట్లాడుతూ - ఛ‌త్రపతి ఒక  గొప్ప స్క్రిప్ట్.  దానిని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి మాకు ఒక స్టార్‌ అవసరం. ఈ ప్రాజెక్ట్‌కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. అలాగే  రీమేక్‌లు తెరకెక్కించడంలో వి.వి.వినాయక్‌ ఎంతో నైపుణ్యం కనబరుస్తారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్  విష‌యంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రీ  ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి జ‌న‌రేష‌న్స్‌కి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేస్తున్నాం అన్నారు.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ -  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఛత్రపతి సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. పెన్‌ స్టూడియోస్‌, డాక్టర్‌. జయంతిలాల్ గారి‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. న‌న్ను టాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌యం చేసిన  వి.వి.వినాయక్ గారితో మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌డం ఒక గొప్ప అవకాశం. ప్రభాస్ గారు ‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా అన్నారు.

మాస్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్‌, మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ రీమేక్ చిత్రం‌పై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.  ఈ ప్రాజెక్ట్‌కి సంబందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

Bellamkonda Sai Sreenivas is ready for his Bollywood debut:

<strong>Bellamkonda Sai Sreenivas Grand Bollywood Debut With The Remake Of SS Rajamouli&rsquo;s Prabhas starrer &lsquo;Chatrapathi&rsquo; To Be Directed By VV Vinayak Under Pen Studios</strong>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs