Advertisement
Google Ads BL

అల్లు అర్హకి అందమైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్!


అల్లు అర్జున్ అంటే కేవలం స్టైలిష్ స్టార్ మాత్రమే కాదు.. పర్ఫెక్ట్ ప్యామిలీ మ్యాన్ కూడా. ఎప్పుడు ఖాళీ టైమ్ దొరికినా కూడా వెంటనే పిల్లలతో కాలం గడిపేస్తారు. వాళ్లతోనే ఉంటారు.. వాళ్లతో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఇప్పుడు కూడా ఇదే చేసారు అల్లు అర్జున్. నవంబర్ 21న అల్లు అర్జున్ కూతురు అర్హ నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తన కూతురు కోసం ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అంజలి సినిమాలోని టైటిల్ సాంగ్‌ను ఇప్పుడు అర్హపై రీ క్రియేట్ చేసారు. దీనికోసం మణిరత్నంతో పాటు సంగీత దర్శకుడు ఇళయరాజాకు కూడా ముందుగానే క్రెడిట్స్ ఇవ్వడంతో పాటు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు అల్లు అర్జున్. ఇళయరాజా స్వరపరిచిన ఈ  పాటను వేటూరి సుందరరామ్మూర్తి ఎంతో అద్భుతంగా రచించారు.

Advertisement
CJ Advs

అప్పుడే కాదు ఇప్పటికీ అంజలి అంజలి పాట అద్భుతమే. ఈ పాటలో ఎంతో క్యూట్‌గా ఒదిగిపోయింది అల్లు అర్హ. పాట సాంతం క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ మాయ చేసింది. ఈ పాటలో అర్హతో పాటు ఆమె అన్నయ్య అల్లు అయాన్, తాతయ్య అల్లు అరవింద్, శేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ నటించడం విశేషం. అల వైకుంఠపురములో సినిమాలో ఓ మై డాడీ పాటకు కొరియోగ్రఫీ అందించిన గణేష్ స్వామి దీనికి డాన్స్ కంపోజ్ చేసారు. సూర్య సినిమాటోగ్రఫర్‌గా పని చేసారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరోవైపు అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్ డే రోజు కూతురుకు అందమైన గిఫ్ట్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్. 2016 నవంబర్ 21న జన్మించింది అల్లు అర్హ.

Click Here For Allu Arha's Anjali Anjali Video

Allu Arjun shares Special gift for daughter Arha:

Allu Arjun shares Special gift for daughter Arha on her 4th Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs