Advertisement
Google Ads BL

'భద్రకాళి’ చిత్ర ట్రైలర్ విడుదల


లెజెండరీ హీరోయిన్ జయప్రద తో 43 సంవత్సరాల క్రితం భద్రకాళి అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియెట్ చేసింది. మళ్ళీ అదే టైటిల్ తో  బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా వస్తున్న చిత్రం భద్రకాళి. ఈ చిత్రంలో ఏడు సూపర్‌హిట్‌ సాంగ్స్ వీగా మ్యూజిక్ ద్వారా ఆడియో  విడుదలయ్యాయి. దీపావళి కానుకగా చిత్రం ట్రైలర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నటి సీత మాట్లాడుతూ : ఈ చిత్రంలో నేను భద్రకాళి గా నటిస్తున్నాను. నా కెరీర్ లో ఇప్పటివరకు దేవత పాత్రలు ఎన్నో వేసాను కానీ రౌద్రం కూడిన  భద్రకాళి గా వేయడం ఇదే తొలిసారి, ఈ మధ్య భక్తిరస ప్రధాన చిత్రాలు రావడం లేదు అప్పట్లో ఫిలిం ద్వారా సినిమాలు నిర్మించేవారు గ్రాఫిక్స్ కి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు డిజిటల్ మూవీస్ వచ్చేశాయి అత్యుత్తమ సాంకేతిక విలువలతో  కూడిన చిత్రాలను రూపొందించడానికి అవకాశం వుంది.  ఈ చిత్రం కూడా ప్రస్తుతం వున్నా టెక్నాలజీ ని ఉపయోగించుకుని నిర్మిచారు. 

దర్శకుడు కె . ఏం . ఆనంద్ మాట్లాడుతూ : భద్రకాళి అమ్మవారికి ఓ భక్తుడికి మధ్య జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రెడీ చేసాము. సీత గారు ఆ పాత్రలో అమ్మవారుగా ఒదిగిపోయారు. చిత్రంలోని సహజమైన విజువల్ ఎఫెక్ట్ కోసం గ్రాఫిక్స్ చేయడం జరిగింది. భక్తి రసప్రదాన చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది.  ఈ గ్యాప్ పూరించడానికి ఈ కథను ఎంపిక చేయడం జరిగింది అన్నారు

నిర్మాత  చిక్కవరపు రాంబాబు మాట్లాడుతూ : అన్నమయ్య,  అమ్మోరు, దేవుళ్ళు చిత్రాల స్థాయిలో ఈ చిత్రం వచ్చింది.  ఈ జోనర్ లో వున్నా సినిమాలకు సంగీతం ముఖ్యం అవి ఎవర్ గ్రీన్ గా ఉండాలి అందుకోసం  ఇందులో ఏడు పాటలు కూడా అదేస్థాయిలో రికార్డింగ్ చేసాము వీగా మ్యూజిక్ ద్వారా  విడుదల చేసాము.  దీపావళి పండుగ కానుకగా ఈ రోజు ట్రైలర్ అమ్మవారు భద్రకాళి అశ్విర్వాదంతో విడుదల కావడం ఆనందంగా వుంది అన్నారు.

Bhadrakali Trailer release :

Diwali Special: Bhadrakali Trailer release 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs