Advertisement
Google Ads BL

రానా పెళ్లి ఫోటో చూసి షాకయ్యా అంటున్న హీరోయిన్?


తెలుగులో అవకాశాలు తగ్గినా.. తమిళ సినిమాలతో బిజీ అయిన రాశి ఖన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ గ్లామర్ ఒలకబోస్తూ.. ఫిట్ గా తయారైంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశి ఖన్నా ఇప్పుడు స్లిమ్ గా గ్లామర్ గా తయారైంది. అయితే లాక్ డౌన్ లో పేరెంట్స్ దగ్గరే ఉన్న రాశి ఖన్నా ఈమధ్యనే షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టిందట. షూటింగ్ స్పాట్ లో ఒక్కసారిగా తన చుట్టూ 25 మందిని చూసినప్పుడు భయం వేసినా.. ఆ తరవాత వర్క్ లో బిజీ అయ్యాకా ఆ భయాన్ని పక్కనపెట్టేసా అని చెబుతుంది. ఇకపోతే ఈ మధ్యన రాశి ఖన్నా విలేజ్ లుక్ అందరిని సర్ప్రైజ్ చేసింది. రాశి లంగావోణీ లుక్ ఏదో సినిమా కోసం అనుకుంటే... కాదు ఎప్పుడూ గ్లామర్ గా కనబడే నాకు ఇలా విల్లెజ్ అమ్మాయి లుక్ ట్రై చెయ్యాలనిపించి దాని కోసం ఫోటో షూట్ చేయించుకున్నా అని చెబుతుంది రాశి ఖన్నా.
పక్కా తెలుగమ్మాయిలా నటించాలనేది నా కల అంటున్న రాశి ఖన్నాకి గ్లామర్ పాత్రలన్నా ఇష్టమేనట. ప్రతి ఏడాది దీపావళికి కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే రాశికి  ఈసారి షూటింగ్ బిజీ వలన ఇంట్లో దివాళీ చేసుకోలేకపోతున్నానంటూ తెగ ఫీలవుతుంది. ఇక ప్రస్తుతానికి సింగిల్ అంటున్న రాశి ఖన్నా... స్పెషల్ పర్సన్ అంటూ నా జీవితంలో ఎవరూ లేరు. ఒకవేళ నా లైఫ్ లోకి ఎవరన్నా స్పెషల్ పర్సన్ అడుగుపెడితే అతనితో డేటింగ్ కి వెళ్తా అంటుంది రాశి.
అయితే లాక్ డౌన్ లో చాలామంది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అందులో రానా పెళ్లి ఫోటో చూసి రాశి ఖన్నా షాకయ్యిందట. అలా షాకయిన క్షణం ఇప్పటికి గుర్తుంది అంటుంది. ఇక నితిన్, నిఖిల్, కాజల్ సోల్మెట్స్ ని వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఏదో ఒక రోజు నా లైఫ్ లోనూ అలాంటి మధుర క్షణాలు వస్తాయనుకుంటున్నా.. ప్రస్తుతం తినడం, నిద్ర పోవడం, వర్కౌట్స్ చెయ్యడమే నా పని అంటుంది అందాల రాశి.

Advertisement
CJ Advs

I was Shocked by seeing Rana Wedding PIc: Rashi Khanna:

Rashi khanna says she was shocked 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs