Advertisement
Google Ads BL

నాని - వివేక్ ఆత్రేయ మూవీ అనౌన్సమెంట్!!


నేచుర‌ల్ స్టార్ నాని అభిమానుల‌కు దీపావ‌ళి వేడుక‌లు కాస్త ముందుగానే మొద‌ల‌య్యాయి. ఎందుకంటే వాళ్లు ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది.

Advertisement
CJ Advs

నాని క‌థానాయ‌కుడిగా ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ‌ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

నాని క‌థానాయ‌కుడిగా న‌టించే ఈ 28వ చిత్రం ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న‌ది.

కొన్ని కాంబినేష‌న్లు ఇన్‌స్టంట్ క్రేజ్‌ను తీసుకొస్తాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్ స‌రిగ్గా అలాంటిదే.

ఇంకా టైటిల్ ఖ‌రారు చేయ‌ని ఈ మూవీలో నాని జోడీగా మ‌ల‌యాళం భామ న‌జ్రియా ఫ‌హాద్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు తెలుగు సినీ కుటుంబంలోకి మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతోంది.

న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తోన్న ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

న‌వంబ‌ర్ 21న ఒక‌ క‌ర్టెన్ రైజ‌ర్ ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఈ రోజు మంచిరోజు కావ‌డంతో సినిమాను ప్ర‌క‌టించామ‌ని వారు తెలిపారు

Nani, Vivek Athreya, Mythri Movie Makers Film Announcement:

<span>Natural Star Nani&rsquo;s lovers. The much awaited announcement is here</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs