Advertisement
Google Ads BL

కరోనా లేదు.. చిరుని కన్ఫ్యూజ్‌ చేసిన కరోనా!!


గత ఆదివారం ఆచార్య సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే ముందు మెగాస్టార్ చిరు కరోనా టెస్ట్ చేయించుకోగా.... అందులో చిరుకి రిజల్ట్ పాజిటివ్ రావడంతో.. ఆయన హోమ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయి.. కరోనా పాజిటివ్ అయినా కానీ ఎలాంటి కరోనా లక్షణాలు నాలో లేవు నేను బావున్నా అంటూ ట్వీట్ చెయ్యడంతో మెగా ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అందులో చిరు గత మూడు నాలుగు రోజుల నుండి నాతో కాంటాక్ట్ అయిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోమనడంతో.. ఆయనతో కలిసిన నాగార్జున, కేసీఆర్, మరికొందరు అధికారులు కరోనా టెస్ట్ లు చేయించుకోగా... అందరికి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక చిరు కూడా గత నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన అభిమానులు చిరు త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. అయితే తాజాగా చిరు ‘‘గత నాలుగు రోజులుగా కరోనా, కాలం రెండూ నన్ను కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం కరోనా టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బేసిక్ మెడికేషన్ మొదలు పెట్టాను. రెండు రోజులు గడిచినా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో.. నాకు అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు సిటీ స్కాన్ చేసి.. చెస్ట్ లో ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారణకు వచ్చాక కరోనా టెస్ట్ చేస్తే నెగెటివ్ వచ్చింది. అక్కడ నెగెటివ్ వచ్చాక మరోసారి మరోచోట నివృత్తి చేసుకుందామని టెనెట్ ల్యాబ్ లో మూడు రకాల కిట్స్ తో మూడుసార్లు టెస్ట్ చేయించగా అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది.

ఫైనల్‌ గా నాకు ఆదివారం ఎక్కడైతే టెస్ట్ చేసారో అక్కడ మళ్ళీ RT PCR టెస్ట్ చేయించగా నెగిటివ్ వచ్చింది. అయితే ఈ మూడు రిపోర్ట్స్ చూశాక మొదటి రిపోర్ట్ ఫాల్ట్ కిట్ వలన వచ్చింది అని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. సో నాకు కరోనా లేదు. ఈ సమయంలో మీరు నా మీద చూపించిన ప్రేమకి, ఆదరాభిమానాలకు, చేసిన పూజలకు కృతజ్ఞతలు’’ అంటూ ట్వీట్ చెయ్యడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Corona: Faulty Kit Misleads Chiru:

Chiru Testes Negetive for Covid19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs