Advertisement
Google Ads BL

సీతాయణం టీజర్ ని లాంచ్ చేసిన రవితేజ!


హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ నటించిన 'సీతాయణం' టీజర్ ని లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ!

Advertisement
CJ Advs

కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న  సినిమా  'సీతాయణం'. ప్రముఖ కన్నడ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించారు. అనహిత భూషణ్ కథానాయిక. ఈ చిత్రం తెలుగు టీజర్ ని మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేయగా, కన్నడ - తమిళభాషల్లో టీజర్ ని కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్ కుమార్ విడుదల చేశారు. టీజర్ ని విడుదల చేసిన అనంతరం హీరో రవితేజ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్, టైటిల్పొయెటిక్ గా ఉంటే, మోషన్ పోస్టర్ రొమాంటిక్ గా ఉంది. టీజర్ చాలా ఆసక్తి కలిగించేలా బయటకొచ్చింది. తండ్రి ఎవరో తెలియని అనాథగానైనా బ్రతికేయచ్చు కానీ.. శత్రువెవరో తెలియకపోతే ప్రతీ క్షణం నరకమే అన్న డైలాగ్ సినిమా పై మరింత ఆసక్తి పెంచింది. కథాంశం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా ఉంది. హీరోగా అక్షిత్ శశికుమార్ తండ్రిని మించిన తనయుడు గా గుర్తింపు పొందాలని, కన్నడ, తెలుగు, తమిళ భాషలలోమంచి హీరోగా నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

 కరునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. సుప్రీమ్ హీరో, సోదర సమానుడుశశికుమార్ తనయుడు మూడు భాషల్లో ఏకకాలంలో హీరోగా పరిచయం అవ్వడంఅరుదుగా దక్కే గౌరవం. చాలా గొప్ప విషయం. నా చేతుల మీదుగా టీజర్ ని లాంచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది .అలాగే సినిమాడెఫినిట్ గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. 'సీతాయణం' అనే టైటిల్ చాలా పొయెటిక్గా ఉన్నా, టీజర్ యాక్షన్ థ్రిల్లింగ్ గా ఉంది. బహుశా రామాయణం మిక్సెడ్ కాంటెంపరరీకంటెంట్ తో  ఏదో కొత్త మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మూడుభాషల్లో నిర్మిస్తున్న నిర్మాత లలితా రాజ్యలక్ష్మి గారిని అభినందిస్తూ, అన్ని భాషల్లోప్రేక్షకులు ముక్త కంఠం తో మా అక్షిత్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రామాయణంలా సీతాయణం కూడా మూడు భాషల్లో చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నాను. మాకుటుంబానికి సన్నిహితులైన శశి కుమార్ లాగే, మంచి అందం టాలెంట్ ఉన్ననటుడిగాఅక్షిత్ ని కూడా కన్నడ ప్రేక్షకులు ఆశీర్వదించాలి అని అన్నారు. 

దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ రెస్పెక్ట్ ఉమెన్ అన్న ట్యాగ్ లైన్ కి మా“సీతాయణం” చిత్ర కథ పెర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తుంది. మూడు భాషల ప్రేక్షకులకు ఒక విభిన్న అనుభూతిని, ఆసక్తిని కలిగిస్తుంది. నటి నటుల సహకారంతో,  మా నిర్మాత లలితా రాజ్యలక్ష్మి ప్రోత్సాహంతో చిత్ర షూటింగ్ ను పూర్తి చేయగలిగాం. అన్ లాక్ ప్రక్రియఅనంతరం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మిగిలిన షూట్ ని పూర్తి చేయగలిగాం. ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషల నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి అన్నారు.

నిర్మాత  లలితా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. వరుసగా చిత్రాలు నిర్మించాలన్న ఆలోచనకు “సీతాయణం” మరింతగా ఉత్సాహాన్నిస్తుంది. త్వరలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. టీజర్ విడుదల చేసిన మాస్ మహారాజ రవితేజకు, అలాగే కన్నడ, తమిళటీజర్ ను విడుదల చేసిన కరునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ కు కృతజ్ఞతలుతెలుపుకుంటున్నాను అన్నారు. 

Ravi Teja launches Sitayanam teaser!:

Ravi Teja launches Sitayanam movie teaser!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs