Advertisement
Google Ads BL

డైరెక్టర్ ఫస్ట్ లుక్


డైరెక్టర్ ఫస్ట్ లుక్  విడుదల!

Advertisement
CJ Advs

తొలి చిత్రం నాటకం వంటి విభిన్నకథాచిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకొని హీరోగా  ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని  సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆశిష్ గాంధీ.. మలి చిత్రంగా  మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. శ్యామ్ మరొక హీరోగా  మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా  మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్లు పై కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ  దర్శకత్వంలో రూపొందుతోన్న డైరెక్టర్ చిత్రాన్ని  ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు.   షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.

ఆశిష్ గాంధీ కెరియర్ ని మలుపు తిప్పే చిత్రం ఇది!

ఇప్పటివరకు తెలుగు తెరపైన ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి.. వస్తున్నాయి.. ఆడియెన్స్ కి నచ్చే, మెచ్చే చిత్రాలు సక్సెస్ అవుతున్నాయి. అంతే కాదు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు అబ్బురపరిచే విజువల్స్ కథలో అనేక ట్విస్టులు ఉంటేనే అచిత్రం ప్రజాదరణ పొందుతుంది. అలాంటి చిత్రమే మా డైరెక్టర్. మా హీరో ఆశిష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం ఆశిష్ కెరియర్ ని మలుపు తిప్పే చిత్రం అవుతుంది.. సాయి కార్తీక్ బ్యూటిఫుల్ బాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు... ఆదిత్య వర్ధన్ కెమెరా విజువల్స్ మా సినిమాకి వన్ ఆఫ్ ది  ఎస్సెట్ కానుంది. షూటింగ్ పూర్తయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ పనులు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము.. అని నిర్మాతలు నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల తెలియజేసారు.

 అన్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ తో వస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ !

సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిస్తున్న డైరెక్టర్ చిత్రాన్ని మేము డైరెక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా  టెక్నీకల్ టీం అందరూ ఎంతో సపోర్ట్ చేశారు.. అందరి సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న టైంలో పూర్తి చేసాం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ కోపరేషన్ మరువలేనిది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రంని నిర్మించారు. వారికి మా థాంక్స్. అలాగే మా హీరో ఆశిష్ గాంధీ నాటకం చిత్రం తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా  సెలెక్టెడ్ గా కథలను చూజ్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. మా కథ విని ఎంతో ఇంప్రెస్ అయి ఈ చిత్రం చేసాడు. డెఫినెట్ గా ఈ డైరెక్టర్ చిత్రం పెద్ద హిట్ అయి మా  టీం అందరికీ మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అని చిత్ర దర్శకులు కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ అన్నారు.

ఆశిష్ గాంధీ, శ్యామ్ హీరోలుగా మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్స్ గా  నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ అప్పారావు, వీరభద్రం, తిరుమలరెడ్డి, ఆర్కే, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ  చిత్రానికి సంగీతం; సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య వర్ధన్, ఎడిటింగ్: బి . నాగేశ్వర్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్: తిరుమల రెడ్డి ఎల్ల, పి.ఆర్.ఓ.సాయి సతీష్, నిర్మాతలు: నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల, రచన-దర్శకత్వం: కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ.

Director First Look Release:

Director Movie First Look Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs