Advertisement
Google Ads BL

స‌‌త్య‌దేవ్‌ గుర్తుందా శీతాకాలం గెస్ట్ రోల్ లో మెఘా ఆకాష్ !!


పాత్ర లో ప‌ర‌కాయ‌ప్రవేశం చేసే చాలా మంది త‌క్కువ‌మంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. సినిమాల్లో ఆయ‌న పాత్ర‌ల్లో స‌త్య‌దేవ్ ఎప్పూడు క‌నిపించరు. పాత్ర మాత్ర‌మే ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రిస్తుంది. లాక్‌డౌన్ ప్యాండ‌మిక్ సిట్యూవేష‌న్ లో కూడా ఉమామ‌హేశ్వ‌రావు ఉగ్ర‌రూప‌స్య అంటూ ప‌ల‌క‌రించి ఎంట‌ర్‌టైన్ చేశారు. అలా వ‌‌రుస‌గా వినూత్న చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో సెప‌రెట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న స‌త్య‌దేవ్ హీరోగా, ఎలాంటి పాత్ర ఇచ్చినా న‌ట‌న‌లో అందంగా క‌నిపించే ఎవ‌ర్‌గ్రీన్ మిల్కీబ్యూటి త‌మన్నా జంట‌గా సౌత్ ఇండియాలో న‌టుడుగా త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన గుర్తింపు పొందిన ప్ర‌‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కుతున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే స‌త్య‌దేవ్ మ‌రొక్క‌సారి డిఫ‌రెంట్ చిత్రాన్ని అందులోనూ ల‌వ్‌స్టోరి చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఈ టైటిల్ కి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం యూనిట్ లో కొత్త ఎనర్జి ని ఇచ్చింది. స‌త్య‌దేవ్‌, త‌మన్నాల కాంబినేష‌న్ అన‌గానే ట్రేడ్ లో క్రేజ్ వ‌చ్చింది. ఇప్ప‌డు ఈ క్రేజ్ ని రెట్టింపు చేయ‌టానికి మ‌రో ఎన‌ర్జిటిక్ బ్యూటి మెఘా ఆకాష్ ఆన్ బోర్డ్ అయ్యింది. చాలా క్యామియో రోల్ లో ఎనర్జిటిక్ గా మెఘా ఆకాష్ స‌త్య‌దేవ్ తో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన ఆడియో ని ఫ్యాన్సి ఆఫ‌ర్ తో క‌న్న‌డ లో నెం1 ఆడియో కంపెని ఆనంద్ ఆడియో వారు తెలుగులో సొంతం చేసుకొవ‌టం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ని న‌వంబ‌ర్ 6 నుండి హైద‌రాబాద్ లో ప్రారంభిస్తున్నారు.

Advertisement
CJ Advs

ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. స‌త్య‌దేవ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్ అన‌గానే తెలుగు సినిమా మార్కెట్ లో వ‌చ్చిన క్రేజ్ మాములుగా లేదు.  అలాంటిది ఇప్ప‌డు ఆ క్రేజ్ ని డ‌బుల్ చేస్తూ మెఘా ఆకాష్ క్యామియో రోల్‌లో యాడ్ అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. మా యూనిట్ అంతా మంచి ఎనర్జితో వున్నారు.  అంద‌రూ కంగ్రాట్స్ చెప్తున్నారు. తెలుగుకి ఆనంద్ ఆడియో తెలుగు కి మా చిత్రం ద్వారా ప‌రిచయం అవ్వ‌ట‌మే కాకుండా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం ఎం కీర‌వాణి గారి కుమారుడు ఇటీవ‌లే క‌ల‌ర్‌ఫోటో లాంటి చిత్రానికి త‌న మ్యూజిక్ తో ప్రాణం పోసిన  కాల‌భైర‌వ అందిస్తున్న మ్యూజిక్ ని ఫ్యాన్సి రేట్ కి కొనుగొలు చేయ‌టం ఈ చిత్రం యెక్క మెద‌టి రికార్డ్. జ‌న‌ర‌ల్ గా ప్రేమ‌క‌థ లు శీతాకాలం లోనే మెద‌ల‌వుతాయి.. అందుకే గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని శీతాకాలం లోనే ప్రారంభిస్తున్నాము. మెఘా ఆకాష్ పాత్ర చాలా అందంగా వుంటుంది. హీరో స‌త్య‌దేవ్ పాత్ర‌తో ట్రావెల్ అయ్యే కెర‌క్ట‌ర్  చాలా ప్ర‌త్యేఖ‌మైన క్యామియో రోల్ కి మెఘా న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం లో మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్ లు ట్రావెలింగ్ లో చూస్తారు. చాలా మంచి ప్రేమ‌క‌థ ని తెర‌కెక్కిస్తున్నాన‌నే తృప్తి వుంది. న‌వంబ‌ర్ 6 నుండి హైద‌రాబాద్ లో షూటింగ్ స్టార్ట‌వుతుంది. అని అన్నారు.‌

Megha Akash cameo role in Sathyandev - Tamanna's Gurthunda Seethakalam:

Megha Akash cameo role in Sathyandev - Tamanna's Gurthunda Seethakalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs