Advertisement
Google Ads BL

కృష్ణ-విజయనిర్మల కుటుంబ సభ్యుడు మరో హీరో!


కృష్ణ-విజయనిర్మల కుటుంబ సభ్యుడు శరణ్ హీరోగా, రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభమైంది

Advertisement
CJ Advs

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. వాళ్ళ మనవడు శరణ్ ది లైట్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. విజయదశమి సందర్భంగా సోమవారం ఉదయం అతని తొలి చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మాన్విత, కుశల కుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలత బి. వెంకట్, వెంకట్ బులేమని నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం హీరో శరణ్, నటుడు జెమినీ సురేష్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణగారు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ యువ హీరోలు సుధీర్ బాబుగారు, నవీన్ విజయకృష్ణగారు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నటులు డాక్టర్ వీకే నరేష్ గారు క్లాప్ ఇచ్చారు. అంతకు ముందు సుధీర్ బాబు, ప్రియా సుధీర్ బాబు దంపతుల చేతుల మీదుగా స్క్రిప్ట్  పూజా కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళిద్దరూ దర్శకుడు రామచంద్ర వట్టికూటికి స్క్రిప్ట్ అందజేశారు. విజయనిర్మలగారి విగ్రహానికి పూలమాల వేసిన శరణ్ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. 

సూపర్ స్టార్ కృష్ణగారు మాట్లాడుతూ సినీటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న, మా కుటుంబంలో సభ్యుడైన శరణ్ కి నా అభినందనలు. ఇంతకు ముందు మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించారు. అభిమానించారు. అలాగే, శరణ్ ని కూడా ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకి, దర్శకులకి నా శుభాకాంక్షలు అని అన్నారు.

ప్రముఖ నటి జయసుధగారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణగారు, శ్రీమతి విజయనిర్మలగారి దివ్య అశీసులతో మా ఫ్యామిలీ నుండి మరో హీరో పరిచయం అవుతున్నారు. సినీటేరియా బ్యానర్ వారు కొత్త హీరో శరణ్, కొత్త దర్శకుడు రామచంద్ర వట్టికూటిని పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, శరణ్ పెద్ద హీరో అవ్వాలని.. అలాగే, రామచంద్ర కూడా పెద్ద దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీటేరియా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి పిక్చర్ తీయాలి. పెద్ద సక్సెస్ అవ్వాలి. ప్రొడ్యూసర్ వెంకట్, శ్రీలతకి మా థాంక్స్ అని అన్నారు. 

డాక్టర్ వీకే నరేష్ గారు మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు రామచంద్ర నాకు బాగా పరిచయస్తుడు. సోదరుడి లాంటివాడు. తను మంచి రైటర్. ఆయన స్వహస్తాలతో రాసినటువంటి స్క్రిప్ట్ ఇది. శరణ్ మా ఫ్యామిలీ మెంబెర్. తను నాకు అల్లుడు అవుతాడు. నా కజిన్ రాజు కుమారుడు. కృష్ణగారు, జయసుధగారు, సుధీర్ బాబు గారు, ప్రియా గారు.. మా అందరి దీవెనలతో మా ఫ్యామిలీ నుండి మరో హీరో శరణ్ ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. మేమంతా శరణ్ కి సపోర్ట్ గా ఉంటాం. కచ్చితంగా ఈ సినిమా బావుంటుంది అని అన్నారు.    

యువ హీరో సాయి తేజ్ గారు మాట్లాడుతూ శరణ్.. విషింగ్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రాండ్ లాంచ్. నువ్వు ఎన్నో సినిమాలు చేయాలనీ, చాలా విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. తొలి సినిమా ఎప్పుడూ స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

సుధీర్ బాబు గారు మాట్లాడుతూ మా ఫ్యామిలీ నుండి మరొకరు హీరోగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. శరణ్ కి ఆల్ ది వెరీ బెస్ట్. హీరో కావాలని తను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. 

హీరోగా పరిచయమవుతున్న శరణ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత కృష్ణగారు, గిన్నిస్ బుక్ హోల్డర్ విజయనిర్మలగారి బ్లెస్సింగ్స్ తో హీరోగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారు లేకుండా ఈ రోజు ఈవెంట్ జరిగి ఉండేది కాదు. ఆయనకు, జయసుధ ఆంటీ, సుధీర్ బాబు-ప్రియా గారికి థాంక్స్. బెస్ట్ విషెస్ అందించిన నవీన్ అన్న, తేజ్ అన్నకి థాంక్స్. నాకెంతో సపోర్ట్ చేస్తున్న మా నాన్నగారికి థాంక్స్. సినిమా విషయానికి వస్తే.. నేను, చంద్రగారు ఏడాదిన్నరగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న మా నిర్మాతలకి థాంక్స్ అని అన్నారు.

రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో సూపర్ స్టార్ కృష్ణగారు ముందుంటారు. ఆయనతో పాటు గిన్నిస్ బుక్ హోల్డర్ విజయనిర్మలగారు నడయాడిన ఈ ప్రదేశంలో మా సినిమా ప్రారంభం కావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ప్రారంభోత్సవం అద్భుతంగా జరగడానికి వెర్సటైల్ యాక్టర్ డాక్టర్ వీకే నరేష్ గారు అందించిన సహకారం మరువలేనిది. నా కథ వినగానే మరో ఆలోచన లేకుండా వెంటనే చేద్దామని ప్రోత్సహించిన మా నిర్మాత వెంకట్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేసిన సుధీర్ బాబు, నవీన్ గారికి కృతజ్ఞతలు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. సాధారణంగా సినిమా వేడుకలకు దూరంగా ఉండే సుధీర్ బాబు గారి సతీమణి ప్రియాగారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ దంపతుల మీదుగా మా స్క్రిప్ట్ పూజ జరగడం నేను ఎప్పటికీ మరువలేను. మా టీమ్ సహకారంతో ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించి, ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటానని తెలియజేసుకుంటున్నా. ఈ సినిమా సెట్ కావడంలో కీలక పాత్ర శరణ్ అన్నగారు రాజ్ కుమార్ గారిది. ఆయనకీ కూడా రుణపడి ఉంటాను అని అన్నారు. 

నిర్మాతలు శ్రీలత, వెంకట్ మాట్లాడుతూ మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించిన కృష్ణ గారు, డాక్టర్ వీకే నరేష్ గారు, సుధీర్ బాబు, ప్రియా దంపతులకు, నవీన్ విజయకృష్ణగారికి కృతజ్ఞతలు. నవంబర్ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, జనవరి లోపు సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం అని అన్నారు.     

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండియాలో ఎంతోమంది సూపర్ స్టార్లు ఉన్నారు. అందమైన సూపర్ స్టార్, మన అందరికీ తెలిసిన సూపర్ స్టార్ కృష్ణగారు. మంచి మనసున్న హీరో అంటే ఆయనే గుర్తుకు వస్తారు. ఆయన ఆశీర్వాదంతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చారు చంద్రగారు. ఆ వేషం ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. 

శరణ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో జెమినీ సురేష్, జబర్దస్త్ త్రినాథ్, సైరస్ షవా ఖాన్, ఆకుల గోపాల్, డి. సతీష్ తదితరులు నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, కూర్పు: లోకేష్ కుమార్ కడలి, మాటలు: డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: సురేష్ గంగుల, ఛాయాగ్రహణం: భరద్వాజ్, సంగీతం: రఘురామ్, సమర్పణ: మాన్విత, కుశల్ కుమార్ బులేమని, నిర్మాతలు: శ్రీలత బి. వెంకట్, వెంకట్ బులేమని, రచన-దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.

Click Here Vedio:  SHARAN Movie Opening 

SHARAN Movie Opening :

 SHARAN Movie Opening 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs