Advertisement
Google Ads BL

దసరా పండగ సందర్భంగా కొత్త సినిమాలు ప్రారంభం!


>దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతొ ప్రారంభమైన వాళ్ళిద్ద‌రు!

Advertisement
CJ Advs

ర‌మేష్ ఆర్యన్, అర్జున్ మహి(ఇష్టంగా ఫేమ్‌), డాలి చావ్లా, మీన‌ల్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం వాళ్ళిద్ద‌రు. న‌టుడు బ్ర‌హ్మాజీ  కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. బి. చంద్ర‌మౌళి రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పి.సి.సి ఫిలింస్ స‌హాకారంతో అర్య‌మ‌న్ ఫిలింస్ ప‌తాకంపై మండ లత నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా పండగ సందర్భంగా  పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకులు నక్కిన త్రినాధ్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  నేటి నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సంద‌ర్భంగా హీరో ర‌మేష్  ఆర్యన్ మాట్లాడుతూ.. చంద్ర‌మౌళి గారు క‌థ చెప్ప‌గానే మా అంద‌రికీ బాగా నచ్చి ఒక టీమ్‌లా ఏర్ప‌డి ఇష్టంతో ఈ సినిమా స్టార్ట్ చేయ‌డం జ‌రిగింది.  బ్ర‌హ్మాజీ గారి క్యారెక్ట‌ర్ కీల‌కంగా ఉంటుంది. క్రైమ్ నేప‌థ్యంలో సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. త‌ప్ప‌కుండా ఒక బెస్ట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాము. ఒక కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుండి వ‌స్తోన్న చిత్ర‌మిది. మీ అంద‌రి ఆశిర్వాదాలు కావాలి అన్నారు. 

ద‌ర్శ‌కుడు చంద్ర‌మౌళి రెడ్డి  మాట్లాడుతూ.. క‌థ‌కి సూట్ అవ‌డంతోనే  వాళ్ళిద్ద‌రు  అనే టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ఈ మూవీలో ఇద్ద‌రు హీరోలు, ఇద్ద‌రు హీరోయిన్లు. ఈ రోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. నాన్‌స్టాప్‌గా షూటింగ్ జ‌రిపి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేయ‌నున్నాం అన్నారు. అర్జున్ మహి మాట్లాడుతూ.. ఇష్టంగా త‌ర్వాత నేను చేస్తోన్న మూడ‌వ చిత్ర‌మిది. ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాను. క‌చ్చితంగా ఈ సినిమాతో మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని భావిస్తున్నాను అన్నారు. అనంత‌రం హీరోయిన్స్  డాలి చావ్లా, మీన‌ల్ మీన‌న్ మాట్లాడుతూ ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి థ్యాంక్స్ అన్నారు.

నటీనటులు: ర‌మేష్  ఆర్యన్, అర్జున్ మహి, డాలి చావ్లా, మీన‌ల్ మీన‌న్, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు. 

------------------------------------------------------------------------------------------------------


>దసరా పండగ సందర్భంగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభం!

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి.ఎమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచెరపాలెం రాజు, టిఎన్ఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కోటి సంగీతం అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్ లో నిర్మించిన మొదటి సినిమా కళాపోషకులు విడుదలకు సిద్దంగా ఉంది. దర్శకుడు శివ వరప్రసాద్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఇది మా బ్యానర్ లో వస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్. కోటి గారు మా సినిమాకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది, దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవ్వడం ఆనందంగా ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబోతున్నామని అన్నారు.

డైరెక్టర్ శివ వరప్రసాద్ కె మాట్లాడుతూ.. నవంబర్ నుండి హైదరాబాద్ లో ఈ చిత్ర రెగులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి చేస్తాము. సంగీతం ప్రధాన అంశంగా ఈ సినిమా ఉండనుంది కావున ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతం అందించిన కోటి గారిని తీసుకోవడం జరిగింది. హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన పిఎస్.వినోద్ గారి శిష్యుడు చైతన్య కందుల ఈ సినిమాతో కెమెరామెన్ గా పరిచయం కాబోతున్నాడు. ఇంతవరకు రాని ఒక డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతుంది. నేను చెప్పిన కథ విని నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

నటీనటులు: రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కాంచరపాలెం రాజు, టిఎన్ఆర్.

New movies launch on the occasion of Dussehra festival!:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr">New movies launch on the occasion of Dussehra festival!</pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs