Advertisement
Google Ads BL

సంక్రాంతి రేసులో.. రామ్ రెడ్


సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఇస్మార్ట్ శంకర్‌ తర్వాత  ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ హీరోగా చేసిన సినిమా రెడ్ . కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిశోర్‌  నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది .

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. స్రవంతి మూవీస్‌లో రామ్‌తో చాలా మంచి సినిమాలు చేశాం. ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. మణి శర్మ తొలిసారిగా మా సంస్థ లో పని చేశారు .

ఇదో స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కం ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్.ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. కేవ‌లం క్రైమ్ ఎలిమెంట్ మాత్ర‌మే కాదు.. ఇందులో చ‌క్క‌ని ల‌వ్ స్టోరి ఉంది. మ‌ద‌ర్ సెంటిమెంట్.. ఎంట‌ర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి. అని తెలిపారు . 

రామ్‌ మాట్లాడుతూ నా 18వ సినిమా రెడ్‌. కిషోర్ దర్శకత్వంలో నాకిది మూడో సినిమా .ఫస్ట్‌ టైమ్‌ కెరీర్‌లో ఒక థ్రిల్లర్‌ చేశాను .మాస్‌ ఎలిమెంట్స్‌, క్లాస్‌ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి అని చెప్పారు .

కిషోర్ తిరుమల మాట్లాడుతూ రామ్‌గారితో  స్రవంతి మూవీస్‌లో  నేను చేసిన మూడో సినిమా ఇది . రెడ్‌ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ కూడాకొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్‌ అయినప్పటికీ కమర్షియల్‌గా ఉంటుంది అని అన్నారు. 

రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ , నాజ‌ర్ తదితరులు నటించిన  ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: స్రవంతి రవికిశోర్‌, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల.

Hero Ram Red movie Release details:

Hero Ram Red Movie in Sankranthi 2021 Race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs