Advertisement
Google Ads BL

సత్యదేవ్‌ తిమ్మరుసు


లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ తిమ్మరుసు

Advertisement
CJ Advs

బ్లఫ్‌ మాస్టర్‌, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి  విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం తిమ్మరుసు ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.  ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.  

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తిమ్మరుసు చిత్రానికి అసైన్‌మెంట్‌ వాలి  ట్యాగ్‌లైన్‌. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. తిమ్మరుసు సినిమా విషయానికి వస్తే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మంచి టీమ్‌ కుదిరింది. ఈ నెల 21 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాం అన్నారు.

Satyadev's Thimmarusu Movie Opening:

Satyadev's Thimmarusu launched in Hyderabad!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs