Advertisement
Google Ads BL

పుట్టిన రోజు చిరునవ్వు లొలికిస్తూ కీర్తిసురేష్!


రంగ్ దే చిత్రం  లో  కీర్తిసురేష్ ప్రచార చిత్రం విడుదల.

Advertisement
CJ Advs

 ప్రేమ తో కూడిన కుటుంబ కధా చిత్రం రంగ్ దే. ఈరోజు చిత్ర కధానాయిక కీర్తిసురేష్ పుట్టినరోజు సంధర్భంగా  రంగ్ దే లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్.

చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది. ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్  హైదరాబాద్ లో ప్రారంభమై నితిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్ కు సంబంధించి సేఫ్టీ మెజర్స్  పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ఇటలీ లో పాటలచిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి  కానుకగా చిత్రం విడుదల అవుతుంది. 

 యువ కథానాయకుడు నితిన్, మహానటి కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ఈ  రంగ్ దే.  తొలిప్రేమ, మజ్ను వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ రంగ్ దే చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్). సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత:సూర్యదేవర నాగవంశీ. రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Click here: Keerthy Suresh Birthday Stills

Release of Keerthy Suresh poster from Rang De movie:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span>Release of Keerthy Suresh poster from Rang De movie</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs