Advertisement
Google Ads BL

మ‌హాస‌ముద్రం లో అదితి రావ్!


మ‌హాస‌ముద్రం లో హీరోయిన్‌గా అదితి రావ్ హైద‌రి

Advertisement
CJ Advs

 ఒక్కో అనౌన్స్‌మెంట్‌తో మ‌హాస‌ముద్రం చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుకుంటూ వ‌స్తోంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్నారు.

 లేటెస్ట్‌గా ఈ ఫిల్మ్‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. అంద‌చందాల‌తో పాటు అభిన‌య సామ‌ర్థ్యం పుష్క‌లంగా ఉన్న తార‌గా ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతున్న అదితి రావ్ హైద‌రి ఇందులో హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు.

 ప‌ర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న ఆ కీల‌క పాత్ర‌కు ప‌లువురి తార‌ల పేర్ల‌ను ప‌రిశీలించాక‌, అదితి రావ్ అయితే ఆ పాత్ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. ఈ ప్రాజెక్టులో భాగం కావ‌డంతో అదితి రావ్ సైతం ఆనందం వ్య‌క్తం చేశారు.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా అయిన మ‌హాస‌ముద్రం ను ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి, ద‌ర్శ‌కుడు: అజ‌య్ భూప‌తి, నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం, బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌.

Aditi Rao as the heroine in Mahasamudram:

Aditi Rao as the heroine in Mahasamudram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs