Advertisement
Google Ads BL

పీన‌ట్ డైమండ్ చిత్రం ప్రారంభం


అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో పీన‌ట్ డైమండ్ చిత్రం ప్రారంభం.

Advertisement
CJ Advs

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంలో  అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం పీన‌ట్ డైమండ్. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఒక డిఫ‌రెంట్ సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఈరోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా.. 

నిర్మాత‌లు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ -  రెండు కాల‌మాణాల‌కి సంబందించిన ఒక విభిన్న క‌థాంశంతో అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకునేవిధంగా ఈ మూవీ రూపొందుతోంది. 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతూ ఉంటుంది. ఆ రెండు క‌థ‌ల‌కి సంభందం ఏంటి? అలాగే పీన‌ట్ డైమండ్ అని విభిన్న‌మైన టైటిల్ ఎందు‌కు పెట్టాం? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  ఖ‌చ్చితంగా ఆడియ‌న్స్‌కి ఒక మంచి అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది.   ఈ చిత్రానికి సంబందించి మొద‌టి షెడ్యూల్ ఈ రోజు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. మిగిలిన రెండు షెడ్యూల్స్ త‌మిళ‌నాడు, కేర‌ళ‌, వైజాగ్ లో జ‌రుప‌నున్నాం.  మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం. అన్నారు.

The beginning of the Peanut Diamond Movie :

The beginning of the Peanut Diamond Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs