నరుడి బ్రతుకు నటన దీపావళి కి షూటింగ్ ప్రారంభం
>సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్ మెంట్స్ చిత్రం
నరుడి బ్రతుకు నటన గా చిత్రం పేరు ఖరారు
ఆకర్షణీయమైన లోగోతో కూడిన ప్రచార చిత్రం విడుదల
దీపావళి కి షూటింగ్ ప్రారంభం
టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ కలసి నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంతో ఇటు టాలీవుడ్ లోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు వీరిద్దరి విజయవంతమైన కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి నరుడి బ్రతుకు నటన అనే పేరును ఖరారు చేసినట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు... ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేశారు.చిత్రం పేరు, లోగో, ఆకర్షణీయమైన, ఉత్సుకతను కలిగించే చిత్రం ఇందులో కనిపిస్తాయి.ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ చిత్రకధకు సంభంధం ఉందన్నట్లు హెడ్ ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం ఇది ప్రేమ కథాచిత్రమా అనిపిస్తుంది. సహజంగా హార్ట్ సింబల్ రెడ్ కలర్ లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇది బ్లూ కలర్ లో కనిపిస్తుంది... ఇలా ఎందుకు...? ప్రేమ కధకుమించి ఈ చిత్రంలోఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..వేచి చూడాల్సిందే...! చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాల కోసం నిర్మాణ సంస్థకు సంబంధించిన సామాజిక మాధ్యమం ఖాతాను గమనిస్తూ ఉండండి. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో,నిర్మాతసూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది దీపావళి కి ప్రారంభం అవుతుంది.నరుడి బ్రతుకు నటన చిత్రానికి రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ, సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని, సమర్పణ: పి. డి. వి. ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం: విమల్ కృష్ణ.
Advertisement
CJ Advs
Narudi Brathuku Natana Shoot starts from Diwali:
<strong><strong><span style="color: #ff0000;">Narudi Brathuku Natana </span></strong><span style="color: #ff0000;">Shoot starts from Diwali</span></strong>
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads