Advertisement
Google Ads BL

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన యమ డ్రామా!


ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా యమ డ్రామా ట్రైలర్ లాంచ్.
 ఫిల్మీ మెజిషియన్స్ పతాకం పై సుకన్య సమర్పణలో హీరో సాయి కుమార్ యముడిగా టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యమ డ్రామా. ఈ చిత్రానికి టి. రామకృష్ణ రావు నిర్మాత. యముడి కథలతో ఎప్పుడు సినిమాలు తెరకెక్కినా వాటికీ మంచి క్రేజ్ ఉంటుంది. యముడి కథలతో వచ్చిన  యమ గోల, యముడికి మొగుడు, యమ దొంగ, యమ లీల తదితర చిత్రాలు విజయాన్ని అందుకోవడంతో.. లవ్ ఎమోషనల్ డ్రామాతో ఈ యమ డ్రామాని దర్శకుడు ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యమ డ్రామా చిత్రం ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీద లాంచ్ చేసింది చిత్ర బృందం.

 ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ: రెండు జంటల మధ్యన లవ్, ఎమోషన్, యముడి రాసే తల రాతలు ఎలా ఉంటాయో అనేది  ఈ యమ డ్రామా ట్రైలర్ లో దర్శకుడు హర్ష అద్భుతంగా చూపించాడు. యమ డ్రామా సినిమా విజయాన్ని అందుకోవాలని, చిత్ర బృందం సక్సెస్ సాధించాలని అలాగే దర్శక నిర్మాతలు హర్ష, టి రామకృష్ణ రావు లను ప్రత్యేకంగా అభినందించారు.

 దర్శకుడు హర్ష మట్లాడుతూ: అనిల్ రావిపూడి గారు తన సినిమా పనిలో చాలా బిజీగా వున్నా కూడా మా మీద ఉన్న ప్రేమ తో ఆయన మా యూనిట్ కి తన సలహాలు ఇస్తూ, ఈ సమయాన్ని కేటాయించినందుకు చాలా ఆనందంగా వుంది. యమ డ్రామా ట్రైలర్ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా విడుదలవడం సంతోషం. యువత చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి కన్నీళ్లు కారిస్తే కాదు.. చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలరు అనేది తెలుసు కోవాలి అంటూ యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మా చిత్రం తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నట్లుగా చెప్పారు.

నటీనటులు: సాయి కుమార్, పోసాని మురళి కృష్ణ, సుదర్శన్ రెడ్డి (కుమారి 21 F ఫేమ్), నవీన్(కుమారి 21 F ఫేమ్) వేణు వండర్స్, శివ కుమార్(మజిలీ ఫేమ్), శివ నారాయణ (అప్పాజీ అమృతం ఫేమ్), సీనియర్ ఆర్టిస్ట్ జెన్నీ, గౌతమ్ రాజు తదితరులు.
సాంకేతిక బృందం: డి. ఓ. పి: దాము నర్రావుల, మ్యూజిక్: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ఎస్. పి: ఉద్దవ్, నిర్మాత: టి రామకృష్ణ రావు, కథ, డైరెక్షన్: టి హర్ష.
Click Here👉 Yama Drama Movie Trailer

Advertisement
CJ Advs

Yama Drama Launched by Anil Raavipudi!:

Yama Drama Launched by Anil Raavipudi!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs