Advertisement
Google Ads BL

రాజ్ కి ప్లాప్ ల పరంపర!


                రాజ్ తరుణ్ ప్లాప్ ల పరంపర కొనసాగించాడంతే!

Advertisement
CJ Advs

 ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ కి అప్పట్లో డైరెక్షన్ మీదే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ వరస సినిమాలతో హీరోగా మారాక.. ప్రస్తుతం డైరెక్షన్ పక్కనబెట్టి.. నటన మీదే దృష్టి పెట్టా అంటున్నాడు. కానీ రాజ్ తరుణ్ కి గత కొన్నేళ్లుగా హిట్ అనే పదం వినిపించడం లేదు. వరస సినిమాల ప్లాప్స్ తో రాజ్ తరుణ్ మర్కెట్ బాగా పడిపోయింది. రంగుల రాట్నం, లవర్, రాజుగాడు, ఇద్దరి లోకం ఒకటే ఇలా వరస ప్లాప్స్ తో బాగా టెంక్షన్ లో ఉనన్ రాజ్ తరుణ్ కి తాజాగా మరో ప్లాప్ పడింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ - మాళవిక నాయర్ జంటగా నటించిన ఒరేజ్ బుజ్జిగా మార్చ్ లోనే థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదాపడి చివరికి ఓటిటి ఆహ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 అయితే ఒరేయ్ బుజ్జిగా కన్ఫ్యూజన్ కామెడీ తో ప్రేక్షకులకు పిచ్చ బోర్ కొట్టింది. అదే ఒరేయ్ బుజ్జిగా గనక థియేటర్స్ లో విడుదలైతే బయ్యర్ల నెత్తి మీద గుడ్డేసుకోవాల్సి వచ్చేది. థియేటర్స్ లోనే అనకుండా ఎలాగో నిర్మాతలు ఆహా ఓటిటి కి ఒరేయ్ బుజ్జిగా ఇచ్చేసి సేఫ్ అయ్యారు. లేదంటే ఒరేయ్ బుజ్జిగా సినిమాకి వచ్చిన టాక్ కి నిర్మాతలు అడ్డంగా బుక్ అయ్యేవారే. రాజ్ తరుణ్ ఈ సినిమా ప్లాప్ తో ప్లాప్ ల పరంపర కొనసాగించితినట్లే అనిపిస్తుంది. ఒరేయ్ బుజ్జిగా సినిమా చూస్తున్నంత సేపు విజయ్ కుమర్ కొండా గుండెజారి గల్లంతయ్యినే, అలాగే తరుణ్ రోమియో జూలియట్ సినిమాలు గుర్తుకు రావడం.. చాలా కామెడీ సీన్స్ నిజంగా కామెడీ అనిపించేలా ఉండడంతో సినిమా కి సో సో టాక్ పడింది. ఇక సినిమా లెంత్... కత్తెర పడాల్సిన సీన్స్ తో ప్రేక్షకులకు చిరాకు పెట్టించాయి. ఇక ఈ టాక్ తో ఆహా లో ఒరేయ్ బుజ్జిగా వీక్షించడం కూడా ఆహూ అనిపించేలా ఉంది.

A series of flops for Raj Tarun!:

A series of flops for Raj Tarun!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs