శ్రీరామ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఊహించలేదు కదు!
శ్రీరామ్ హీరోగా కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన ఓమ్ శాంతి ఓమ్ సినిమా తెలుగులో ఊహించలేదు కదు పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో నీలమ్ ఉపాధ్యాయ నాయికగా నటించింది. ఊహించలేదు కదు చిత్రాన్ని రెహమాన్ క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు సూర్య ప్రభాకర్.
బస్సు ప్రయాణంలో ప్రమాదం జరిగి వాసు (శ్రీరామ్) ఒక్కరే బతుకుతారు. తన ప్రేయసితో కలిసి వాసు ఎక్కడికి వెళ్లినా ఒక ఐదుగురు ఎదురవుతుంటారు. ఆ ఐదుగురు ఎవరు, వాసును వారు ఎలాంటి సాయం చేయమని కోరారు. ఆ సాయం చేయడం వల్ల హీరో జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి అనేది ఆసక్తికరంగా సాగే కథాంశం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఊహించలేదు కదు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంగీతం - విజయ్ ఈబెనిజీర్, సినిమాటోగ్రఫీ - కేఎం భాస్కరన్, ఎడిటింగ్ - వివేక్ వర్షన్, సమర్పణ - రెహమాన్, నిర్మాణం - రెహమాన్ క్రియేటివ్ కమర్షియల్స్, దర్శకత్వం - సూర్య ప్రభాకర్.