దివంగత శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి వైద్య బిల్లులు నేను చెల్లించ లేదు
దివంగత శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి వైద్య బిల్లుల చెల్లింపులు నేను చేసినట్లుగా వస్తున్న కొన్ని వాట్సప్ సందేశాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుండడం బాధాకరం.. ఇది పూర్తిగా అవాస్తవం. వాటిని దయచేసి ఫార్వర్డ్ చేయవద్దని మనవి.
రెండు వారాల క్రితం ఇంకేమీ చెల్లించనవసరం లేదని ఆసుపత్రి యజమాన్యం దివంగత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తెలియజేశారు. ఆస్పత్రి ఉత్తమ చికిత్సను అందించడమే గాక, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నాకు, అదే విధంగా కొన్ని సార్లు మా తండ్రి గారికి సమాచారం ఇస్తున్నారు. శ్రీ బాలు గారు మా కుటుంబానికి దగ్గర వారైనందున మాకు ఈ విషయాలు తెలియజేశారు.
శ్రీమతి దీపా వెంకట్
(Daughter of Vice President Sri Venkaiah Naidu garu)