Advertisement
Google Ads BL

నేనే తప్పు చెయ్యలేదంటున్నది.


 డ్రగ్స్ కేసులో తన పేరు బయటికి రాగానే సైలెంట్ గా కోర్టు కెళ్ళి తన పేరుతొ అనవసర రాద్ధాంతం చేస్తున్న మీడియా మెడలు వంచిన రకుల్ ప్రీత్ సింగ్ తానేమి డ్రగ్స్ తీసుకోలేదంటూ వాదిస్తుంది. నిన్న ముంబై లోని ఎన్ సీబీ కార్యాలయానికి డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన రకుల్ ప్రీత్.. ఎన్ సీబీ అధికారుల ప్రశ్నల వర్షంలో తడిచి ముద్దైనట్లుగా తెలుస్తుంది. రియా ఫ్రెండ్ గా పార్టీలకు హాజరైన నేను డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ ఎన్ సీబీ ఎదుట వాదించినట్టుగా చెబుతున్నారు. దాదాపుగా నాలుగు గంటలు సాగిన రకుల్ విచారణలో తానేమి డ్రగ్స్ వాడలేదని, కానీ రియా చక్రవర్తి తో డ్రగ్స్ చాట్ చేసినట్లుగా, అలాగే రకుల్ ప్రీత్ మరో నలుగురు స్టార్స్ పేర్లు ఎన్ సీబీ ఎదుట బయటపెట్టినట్టుగా చెబుతున్నారు.

Advertisement
CJ Advs

 తాను సుశాంత్ సింగ్ ఇచ్చే పార్టీ కి రియా తో కలిసి హాజరైనప్పటికీ.. తానేమి డ్రగ్స్ సేవించలేదని వధించినట్టుగా చెబుతున్నారు. ఇక డ్రగ్స్ చాట్ చేసినట్లుగా రకుల్ ఒప్పుకున్నప్పటికీ.. ఆమె డ్రగ్స్ తీసుకోలేదని వాదించినా చెల్లదు. మరి రకుల్ ఈ కేసులో అడ్డంగా బుక్ ఆయనట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఎన్ సీబీ అధికారులు రకుల్ ప్రీత్ విచారణలో భాగంగా ఆమె స్టేట్మెంట్ ని రికార్డు చేసి కోర్టుకి సమర్పించబోతున్నట్టుగా చెబుతున్నారు. మరి రకుల్ నిన్నటివరకు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు ఇలా ఎన్ సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరవడంతో ఆమె ని హీరోయిన్ గా తీసుకున్న మేకర్స్ ఇప్పుడు పునరాలోచనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. 

Rakul never did anything wrong:

Rakul Drugs case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs