నిశ్శబ్ధం దర్శకుడు హేమంత్ మధుకర్ తో ఇంటర్ వ్యూ
నిశ్శబ్ధం ఎలా మొదలైంది?
పుష్పక విమానం టైపులో ప్రస్తుత సాంకేతికను వాడుకొని థిల్లర్ నేపథ్యంగా ఓ ఎక్స్ పెర్మెంటల్ మూవీ చేయాలనుకున్నా. అలా పుట్టిందే ఈ నిశ్శబ్ధం కథ, స్టోరీ మొత్తం రెడీ అయ్యాక ఓ రోజున రైటర్ కొన వెంకట్ గారికి నెరేషన్ ఇచ్చాను, ఆయనకు నచ్చడంతో కోనగారి ద్వారా అనుష్క తదితర యాక్టర్లకు కూడా స్టోరీ చెప్పి ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని దాదాపుగా మొదలుపెట్టే స్థితికి తీసుకువచ్చాను. అయితే ఎక్స్ పర్మెంట్ అంటే నిర్మాతలు పెట్టుబడి పెట్టడానికి కాస్త వెనుకంజ వేసే అవకాశం ఉండటంతో కోనగారి సూచనలతో నేను అనుకున్న మూకీ సినిమాను కాస్త డైలాగ్స్ తో నింపి, మెయిన్ క్యారెక్టర్ వరకు మాత్రం సైలెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నా, కోన గారి అధ్వార్యం లో సిద్ధమైన డైలాగ్స్ నా స్టోరీకి ఎడిషనల్ ఎస్సెట్ గా మారడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వ ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు, వారితో పాటు కోనవెంకట్ గారు తన బ్యానర్ కోన ఫిల్మ్ కార్పోరేషన్ ద్వారా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామీగా చేరడంతో మా నిశ్శబ్ధం తెరకెక్కింది.
ఈ చిత్రాన్ని అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడానికి కారణం ఏంటి?
టైటిల్ కి తగ్గట్లుగానే ఈ సినిమాను ఏదైనా పీస్ ఫుల్ ప్లేస్ లో తెరకెక్కించాలని ముందు నుంచి అనుకున్నాం, అయితే విజువల్ గ్రాండియర్ గా కనిపించడంతో పాటు ఆడియెన్స్ కి కొంతమెర ఫ్రెష్ ఫీల్ రావడానికి ఈ సినిమాను అమెరికన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించాము. అలానే ఈ సినిమాలో అనుష్క కూడా అమెరికన్ బార్న్ ఇండియన్ గా కనిపించబోతున్నారు. అలానే అన్ని ముఖ్య పాత్రలు కూడా అమెరికా నేపథ్యంలోనే ఉంటాయి, ఇక హాలీవుడ్ నటుడు మైఖల్ మ్యాడిసన్ ని కూడా ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఓ హాలీవుడ్ నటుడు ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా నిశ్శబ్ధమే కావచ్చు.
అనుష్క, మాధవన్, అంజలి వంటి వారితో మీ ప్రయాణం ఎలా సాగింది?
అనుష్క గారికి ఉన్న ఫేమ్ తో పోల్చుకుంటే నేను చిన్న దర్శకున్ని అయితే వారు మాత్రం ఇమేమి పట్టించుకోకుండా ప్రతిది అడిగి తెలుసుకుని నటించారు. ఈ సినిమా కోసం అమె ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. అలానే మాధవన్ కూడా తన పాత్ర కోసం చాలా ప్రిపరేషన్ తీసుకున్నారు. అంజలి సైతం ఓ అమెరికన్ కాప్ గా కనిపించడానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని తన లుక్ మార్చుకున్నారు. అయితే ఇన్ని టాలెంట్స్ ని ఓ చోట చేర్చి సినిమా తీయడం అంటే కొంతమేర కష్టమే అయినప్పటికి వీరిందరికీ ఉన్న ప్రొఫిషనలీజం కారణంగా మా షూటింగ్ ఆద్యంతం హాయిగా సాగిపోయింది.
పిపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ తో మీ అనుభవం?
పిపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ గారు నేను చెప్పిన కథను నమ్మి బడ్జెట్ విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అమెరికా లో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అనుకోవాలి. విసాలు దగ్గర నుంచి షూట్ లోకేషన్స్ లో పర్మిషన్స్ ఇలా చాలా వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అయితే ప్రొడక్షన్ వారు ఇచ్చిన సపోర్ట్ కారణంగానే నేను ఈ సినిమా షూటింగ్ ని 55 రోజుల్లో ముగించేశాను. ఇక కోన ఫిల్మ్ కార్పోరేషన్ మా సొంత నిర్మాణ సంస్థగా భావిస్తాను, కోనగారితో నా అనుబంధం దాదాపు 15 ఏళ్లుగా సాగుతోంది.
థిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, సౌండ్ ఎలా ఉండబోతుంది?
నిశ్శబ్ధంలో సౌండ్ గురించి నా మాటల్లో చెప్పేకంటే రేపు సినిమా రిలీజైయ్యాక ప్రేక్షకులు వారి అనుభవం ద్వారా అద్భుతమైన ఫీడ్ బ్యాక్ ఇస్తారని నేను కచ్ఛితంగా నమ్ముతున్నాను. సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో అందించిన అద్భుతమైన విజువల్స్ తో మ్యూజిక్ డైరెక్టర్స్ గిరష్, గోపీసుందర్ ఇచ్చిన నేపథ్య సంగీతం పోటీ పడతాయి. మా సినిమాతో గోపీసుందర్ తన కెరీర్ లో తొలిసారిగా ఓ థ్రిల్లర్ కి నేపథ్య సంగీతాన్ని అందించారు.
అమెజాన్ ప్రైమ్ లో నిశ్శబ్ధం విడుదలవ్వడం గురించి ఏం చెబుతారు?
కరోనా నేపథ్యంలో థియేటర్స్ మూసి ఉన్నా ప్రేక్షకులకి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే మాధ్యమాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలానే ఈ సినిమాను చూసి అమెజాన్ వారు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు, ఓటిటిలు ఉన్నంత మాత్రన థియేటర్ కి ఎలాంటి నష్టం రాదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇలాంటి అల్టర్నేట్ ఎంటర్ టేన్మెంట్ మీడియాన్ని కూడా ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2, 2020 నుంచి ఎక్స్ క్లూజీవ్ గా నిశ్శబ్ధం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను ల్యాప్ టాప్, మోబైల్స్ లో చూసేవారు, బెటర్ ఎక్స్ పీరిన్స్ కోసం హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా చూడాల్సిందిగా కోరుతున్నా, అలానే సినిమాను ఫార్వడ్ చేయకుండా అలానే ఫ్లోలో చూస్తే థ్రిల్ ని ఎంజాయ్ చేస్తారు.