యంగ్ హీరో రాజ్‌తరుణ్, విజయ్ కుమార్ కొండా కాంబినేషన్‌లో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి కొత్త చిత్రం ప్రారంభం.
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి ప్రొడక్షన్ నెం.1గా మహిదర్, దేవేష్ నిర్మాతలుగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ హైదరాబాద్ కోకాపేటలో పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత గోపినాథ్ ఆచంట కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించారు. స్క్రిప్ట్‌ను కె.ఎస్. రామారావు చేతుల మీదుగా దర్శకుడు విజయ్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా..
దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ - ‘‘గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రాజ్ తరుణ్‌తో ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ‘ఒరేయ్ బుజ్జిగా..’ మూవీ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది.’’ అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘విజయ్ కుమార్ గారు చాలా టాలెండెడ్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డెఫినెట్‌గా అది ఒక మంచి సినిమా అవుతుంది. వెంటనే ఆయనతో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలమర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - ‘‘రాజ్‌తరుణ్, కొండా విజయ్ కుమార్ గార్ల కాంబినేషన్‌లో డిఫరెంట్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ రోజు నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరిపి చిత్రాన్ని పూర్తిచేయనున్నాం’’ అన్నారు.
రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్, కేదరి శంకర్, టిల్లు వేణు, భూపాల్, అప్పాజీ, రవివర్మ, సంధ్య జనక్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
కథ-మాటలు: నంధ్యాల రవి
సినిమాటోగ్రఫి: ఐ. ఆండ్రూ
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: ప‌్రవీణ్ పూడి
ఆర్ట్: శివ
ఫైట్స్: `రియల్` సతీష్
ప్రొడక్షన్ కంట్రోలర్: బి.వి సుబ్బారావు
కో- డైరెక్టర్: వేణు కురపాటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పలమర్తి అనంత్ సాయి
సమర్పణ: శ్రీమతి పద్మ
నిర్మాతలు: మహిదర్, దేవేష్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా