Advertisement
Google Ads BL

‘కోతి కొమ్మచ్చి’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!


వేగేశ్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం !

Advertisement
CJ Advs

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు వేగేశ్న సతీష్.. మేఘామ్ష్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా ‘కోతి కొమ్మచ్చి’ అనే టైటిల్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనూప్ రుబెన్స్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ.. ‘‘యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న మా చిత్రంలో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. సినిమాలో ఐదు పాటలు ఉంటాయి. యువతను ఆకట్టుకునేలా అనూప్ పాటలు సమకూరుస్తూ, కథకు తగ్గట్టుగా మంచి ఆల్బమ్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం’’ అని తెలిపారు. 

నిర్మాత ఎంఎల్‌వి సత్యానారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. విజయదశమికి పూజా కార్యక్రమాలతో ప్రారంభించి నవంబర్ నుండి షూట్ మొదలు పెడతాం’’ అని అన్నారు.

Kothi Kommachi Movie Music Director Confirmed:

Anup Rubens music to sathish vegesna film Kothi Kommachi movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs