షకలక శంకర్ “బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్‌లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ “బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’’. టైటిల్‌తోనే అటు మాస్ ఆడియన్స్‌లో ఇటు క్లాస్ ఆడియన్స్‌లో అనూహ్య స్పందన తెచ్చుకున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇక ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటరైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచర్ల తెలిపారు.
షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడీతో పాటు మరికొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకుడు కుమారు కోట. షకలక శంకర్‌తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ తాజాగా విడుదల అయింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే అర్ధంలో ఎంత ఫన్ ఉందో ఫుల్ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండబోతుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా చెబుతుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్బంగా
దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ... బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది డైరెక్టర్‌గా నా తొలి సినిమా, ఈ సినిమాని ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీతో తెరకెక్కించాము. షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్‌ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నాను.
నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్, సోమేశ్ ముచర్ల మాట్లాడుతూ... కొత్త దర్శకుడు కుమార్ కోట, ఈ కథను చక్కగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిన డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి. శంకర్ యాక్షన్, కామెడీ తదితర అంశాలు ఈ చిత్రానికి హైలెట్ అవనున్నాయి అని తెలిపారు.
నటీనటులు
షకలక శంకర్
ప్రియ
అర్జున్ కళ్యాణ్
రాజ్ స్వరూప్
మధు
స్వాతి
అవంతిక
హీనా
రితిక చక్రవర్తి
సంజన చౌదరి
సాంకేతిక వర్గం
సమర్పణ : మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్
బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచ్చర్ల
పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్
కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి
మ్యూజిక్ : పిఆర్
స్టోరీ, డైలాగ్స్ : విఎస్ రావ్
డైరెక్టర్ : కుమార్ కోట