Advertisement
Google Ads BL

భూమిపుత్ర క్రియేషన్స్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ విడుదల


భూమిపుత్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెం-1 అనే చిత్రం ద్వారా రామ్ అగ్నివేశ్ నాయుడు అనే నూతన నటుడుని పరిచయం చేస్తున్నాము. తన క్యారెక్టర్ కృష్ణుడుకి రిలెటెడ్‌గా ఉంటుందని, దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ‘రామ్ అగ్నివేశ్ నాయుడు’ పుట్టినరోజు సందర్బంగా గురువారం రిలీజ్ చేసినట్టు ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ సిద్ధం మనోహర్ తెలియజేసారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వర్క్ షాప్స్ జరుగుతున్నాయని, అక్టోబరు మొదటివారంలో షూటింగ్‌కి వెళ్ళబోతున్నట్లు సిద్ధం మనోహర్ తెలిపారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా రామ్ అగ్నివేశ్ నాయుడు మాట్లాడుతూ భూమిపుత్ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెం-1 అనే మూవీలో లీడ్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉందని, కథలో తన క్యారక్టర్ చాలా బాగా డిజైన్ చేశారని, తన మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని, సినిమా కోసం రాత్రింపగళ్ళు కష్టపడుతానని రామ్ అగ్నివేశ్ నాయుడు పేర్కొన్నారు.

ఇది క్రౌడ్ ఫండెడ్ మూవీ అని, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ కొత్త వారే అని, దీనికి సంబంధించిన మిగతా విషయాలు త్వరలో తెలియపరుస్తామని చిత్రం యూనిట్ పేర్కొంది.

Bhumiputra Creations production no 1 Movie First Look out:

Actor Agnivesh Naidu look revealed from Bhumiputra Creations Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs