Advertisement
Google Ads BL

‘క్లైమాక్స్’ అలరిస్తుందంటున్న రాజేంద్రుడు


డైరెక్టర్ భవాని శంకర్ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘క్లైమాక్స్’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది: సీనియర్ హీరో డా. రాజేంద్రప్రసాద్ 

Advertisement
CJ Advs

ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్న ‘డ్రీమ్’ చిత్ర దర్శకుడు భవాని శంకర్ తాజాగా చేసిన పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్ ‘క్లైమాక్స్’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సీనియర్ హీరో డా. రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. కైపాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి, కె.క‌రుణాక‌ర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రఖ్యాత వ్యాపారవేత్తగా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తుండగా, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, శ్రీరెడ్డి‌తో పాటు సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ సందర్భంగా, సీనియర్ హీరో డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు భవాని శంకర్‌తో ఇదివరకు నేను ‘డ్రీం’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో పని చేసాను. ఆ చిత్రానికి రాయల్ రీల్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కానీ అది ఒక జానర్ ప్రేక్షకులకి మాత్రమే నచ్చిందని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్ ఇలా అన్ని వచ్చేలా మల్టీ జానర్ కథతో వస్తున్నారు. ఇవన్నీ ఒకే కథలో ఎలా వస్తాయి అని మీరనుకుంటుంటే, కచ్చితంగా క్లైమాక్స్ చూడాల్సిందే. ప్రస్తుతం విడుదల చేసిన క్లైమాక్స్ చిత్ర మోషన్ పోస్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా ఉండే మా చిత్రాన్ని త్వరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.

దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ.. ‘‘పొలిటిక‌ల్ సెటైర్ నేప‌థ్యంలో థ్రిల్లర్ క‌థాంశంతో తెరకెక్కించిన చిత్రం మా క్లైమాక్స్. చిత్రీకరణ పూర్తయి విడుదలకి సిద్ధంగా ఉన్న మా చిత్రంలో సీనియర్ హీరో డా. రాజేంద్రప్రసాద్ సహా మిగితా పాత్రలు చాలా థ్రిల్లింగ్ గాను, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మొదటిసారి ఒక మల్టి జానర్ చిత్రంతో రాబోతున్నాం. మోషన్ పోస్టర్‌ని రాజేంద్ర ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పినట్టుగానే మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. అలాగే క్లైమాక్స్ కి సంబందించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా క్లైమాక్స్ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. ఎన్నో ఉత్కంఠభరిత కథనాలతో తెరకెక్కిన మా చిత్రం మోషన్ పోస్టర్ ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పొలిటికల్ సెటైర్‌గా సాగనున్న మా చిత్రంలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు ఇతర సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మల్టి జానర్ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని మాకు నమ్మకముంది’’ అని తెలిపారు.

సంగీతం: రాజేష్‌ నిధివన

కెమెరా: ర‌వికుమార్ నీర్ల‌

కొరియోగ్ర‌ఫీ: ప్రేమ్‌ర‌క్షిత్‌

ఎడిటింగ్‌: బ‌స్వా పైడిరెడ్డి

ఆర్ట్: రాజ్‌కుమార్‌.

Rajendra Prasad Talks about Climax:

CLIMAX movie MOTION POSTER Launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs