‘కన్నడ సూపర్ స్టార్’ ఉపేంద్ర నటించగా శ్రీ సిద్దేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నిర్మించగా, లాంకో శ్రీధర్ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం థీమ్ పోస్టర్‌ను ఆర్.జి.వీ. గారి చేతులు మీదుగా విడుదల చేయబడింది.
‘కె.జి.ఎఫ్’ తో 2018లో కన్నడ సినిమా ఇక్కడ అందరికీ దగ్గర అయినప్పటికీ, పలు తెలుగు సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన ఉపేంద్ర ఇక్కడ అందరికి సుపరిచితమే.
ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు, బుద్ధిమంతుడు, సూపర్ వంటి వైవిధ్యంగా ఉండే తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ఉపేంద్ర. సన్ ఆఫ్ సత్యమూర్తితో 2015లో తెలుగు సినిమాను మళ్ళీ పలకరించగా, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ‘కబ్జ’తో మళ్ళీ కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఒరియా మరియు మరాఠీ భాషల్లో పలకరించబోతున్నారు.
తెలుగులో సుధీర్ బాబుతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ దర్శకుడిగా పరిచయం అయిన ఆర్. చంద్రు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ‘కె.జి.ఎఫ్’ సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు అందించబోతున్నాడు.
ఆర్ట్ : శివ్ కుమార్
ఎడిటర్ : మహేష్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : ఎ.జె.షెట్టి
మ్యూజిక్ : రవి. బస్రూర్
సమర్పణ : లాంకో శ్రీధర్
నిర్మాణం : శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్
నిర్మాతలు : ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా
రచన - దర్శకత్వం : ఆర్. చంద్రు