Advertisement
Google Ads BL

సత్యదేవ్‌ కొత్త చిత్రం ‘తిమ్మరుసు’


ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై సత్యదేవ్‌ కొత్త చిత్రం ‘తిమ్మరుసు’

Advertisement
CJ Advs

విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ సినిమా ట్యాగ్‌లైన్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను సోమవారం విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న చిత్రమని తెలియజేసేలా రూపొందిన ఈ టైటిల్ లోగో మరింత ఆసక్తినిరేపుతోంది.  

‘118’ వంటి సూపర్‌హిట్‌ థ్రిల్లర్‌తో పాటు కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్‌ ఇండియా’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’, ‘సూర్యకాంతం’ వంటి డిఫరెంట్ చిత్రాలను అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

‘బ్లఫ్‌ మాస్టర్‌’తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ రీసెంట్‌గా విడుదలైన విలక్షణ చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీని శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించడానికి నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

Satyadev New Film Thimmarusu announced:

East Coast Productions, S Originals to produce Satyadev’s Thimmarusu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs