Advertisement
Google Ads BL

‘లవ్ స్టోరీ’ చివరి షెడ్యుల్ షూట్ స్టార్టయింది


ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటిస్తూ మొదలైన ‘‘లవ్ స్టోరీ’’ చివరి షెడ్యుల్

Advertisement
CJ Advs

యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న ‘‘లవ్ స్టోరీ’’ చివరి షెడ్యుల్ షూటింగ్ మొదలైంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కోవిడ్ అంతరాయం వల్ల వాయిదా పడ్డ షూటింగ్ ఈ రోజు నుండి 15 రోజుల ఏకధాటిగా షూటింగ్ చేసి సినిమాను కంప్లీట్ చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ మా ‘‘లవ్ స్టోరి’’ షూటింగ్ ను ఈ రోజు నుంచి మళ్లీ మొదలు పెడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అన్నీ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నాం. లొకేషన్‌లో కేవలం 15 మంది ఉండేలా చూసుకుంటున్నాం. షూటింగ్ లో పాల్గొనేవారందరికీ ముందే కరోనా టెస్ట్ లు నిర్వహించాం. వాళ్లంతా షెడ్యూల్ కంప్లీట్ అయ్యేదాకా ఇంటికి వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేలా ఏర్పాట్లు చేసాం. మాస్కులు, శానిటైజర్ వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం. 15 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేస్తాం. సరైన సమయం చూసుకుని సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం’’ అన్నారు.

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా

సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్

ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్

మ్యూజిక్: పవన్ సి.హెచ్

సహా నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు

నిర్మాతలు: నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు

రచన, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Love Story Resumes Shooting With Strict Safety Guidelines:

Love Story Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs