Advertisement
Google Ads BL

‘తోలుబొమ్మల సిత్రాలు’ బ్యానర్ లోగో విడుదల


కోమారి జానకిరామ్ దర్శకత్వంలో కోమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం యొక్క ‘తోలుబొమ్మల సిత్రాలు’ బ్యానర్ వీడియో మరియు లోగోను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి. అంజద్ భాషా తాజాగా ఆవిష్కరించారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా బ్యానర్ లోగో ఆవిష్కరించిన అంజద్ భాషా మాట్లాడుతూ.. సినిమా పుట్టుకకి బీజమైన తోలుబొమ్మలాట కళని తోలుబొమ్మల సిత్రాలు అని బ్యానర్‌గా నిర్మించినందుకు అభినందిస్తూ ఈ బ్యానర్ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంస్థగా ఎదగాలని ఈ బ్యానర్‌లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నానని తెలిపారు.

దర్శకులు కోమారి జానకిరామ్ మాట్లాడుతూ.. మా తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లోగో మరియు వీడియా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్ర కథాంశంను తెలుసుకొని ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని వారు తెలుపడం సంతోషం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్‌ను ఇతర విషయాలను త్వరలో తెలుపుతానని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరామెన్: డి.యాదగిరి, ఎడిటింగ్: సునీల్ మహారణ, సంగీతం: యు.వి.నిరంజన్, నిర్మాత: కోమారి జానయ్య నాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోమారి జానకిరామ్.

AP Minister Launches Tholu Bommala Sitralu Logo:

Tholu Bommala Sitralu Logo Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs