‘గుడ్‌లక్ సఖి’ చిత్రంలో ఆది పినిశెట్టి పోషిస్తున్న హీరో గోలీ రాజు సన్నివేశాల చిత్రీకరణ పూర్తి
కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్న ఈ మూవీని వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్ చేసిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని రకాల ప్రేక్షకుల్నీ, ప్రధానంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోందనే విషయం ఈ టీజర్‌ని చూస్తే అర్థమైంది. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి జోడీ చూడముచ్చటగా ఉందనే టాక్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి సహా టీమ్ అందరూ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. శనివారంతో హీరో గోలీ రాజు పాత్రధారి ఆది పినిశెట్టి సన్నివేశాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చప్పట్లు కొడుతూ యూనిట్ మెంబర్స్ ఆయనకు వీడ్కోలు చెప్పారు. ఇప్పటివరకూ అటు ఇంటెన్సిటీ ఉన్న శక్తిమంతమైన పాత్రలు, ఇటు సాఫ్ట్ రోల్స్ పోషించి వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారిగా ఇందులో హిలేరియస్ రోల్‌ను పోషిస్తున్నట్లు టీజర్ ద్వారా మనం గ్రహించవచ్చు. ఒక చురుకైన గ్రామీణ యువతి క్రీడల్లో అడుగుపెట్టి షూటర్‌గా ఎలా ఎదిగి ఊరికి పేరు తెచ్చిందంనే కథాంశంతో తయారవుతున్న ఈ చిత్రంలో షూటింగ్ ట్రైనర్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య వర్మ ఆధ్వర్యంలో అధిక శాతం మహిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం గమనార్హం. వారందరికీ ఇది గర్వకారణమయ్యే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. షూటింగ్‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశలో ఉన్నాయి.
ప్రధాన తారాగణం:
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ
సాంకేతిక బృందం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్
సమర్పణ: దిల్ రాజు (శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్)
నిర్మాత: సుధీర్‌చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ
దర్శకత్వం: నగేష్ కుకునూర్
బ్యానర్: వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్