Advertisement
Google Ads BL

‘రావణలంక’ చిత్ర ఆడియో విడుదల


అతిరథమహారధుల మధ్య ‘రావణలంక’ చిత్ర ఆడియో విడుదల!

Advertisement
CJ Advs

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మాత‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘రావ‌ణలంక’‌. క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు వీర శంకర్ తో పాటు రావణలంక యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో క్రిష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కష్టపడి చేశాను, సన్నిహితులు అడిగారు ఎందుకు నువ్వే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నావని. వేరే నిర్మాతల దగ్గరికి వెళితే బడ్జెట్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే నిర్మించానని చెప్పాను. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి చేశారు. డైరెక్టర్ కష్టం తెరమీద కనిపిస్తుంది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ వీరశంకర్ గారికి అలాగే అందరూ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

డైరెక్టర్ బిఎస్ఎస్.రాజు మాట్లాడుతూ.. చాలా లోకేషన్స్‌లో ఈ సినిమా తీశాం, హిమాలయాలల్లో కొన్ని అద్భుతమైన సీన్స్ తీశాం, అలాగే బ్యాంకాక్, వైజాగ్ లో రిచ్ గా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు నిర్మాత. మా రావణలంక ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి ధన్యవాదాలు అని తెలిపారు.

సత్య మాస్టర్ మాట్లాడుతూ.. హీరో, డైరెక్టర్ టెక్నీషియన్స్ అందరూ బాగా చేశారు. నేను విజువల్స్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో క్రిష్ మంచి హీరోగా పేరు తెచ్చుకోబోతున్నాడని తెలిపారు.

డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ.. హీరో క్రిష్ నాకు బాగా తెలుసు, పలుమార్లు కాల్ చేసి రావణలంక సినిమా గురించి మాట్లాడుతూ సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయని చెప్పేవాడు. ఇప్పుడు చూస్తుంటే నిజం అనిపిస్తుంది. అతనికి మంచి భవిషత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సృజన అనే పాట బాగా పాపులర్ అయ్యింది. రేపు థియేటర్స్ లో కూడా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్నా అన్నారు.

క్రిష్, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశర్మ‌, దేవ్ గిల్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి

బ్యాన‌ర్ - కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్ట‌రీ

నిర్మాత - క్రిష్ బండిపల్లి

మ్యూజిక్ - ఉజ్జ‌ల్

సినిమాటోగ్రఫి - హ‌జ‌ర‌త్ షేక్ (వ‌లి)

ఎడిటర్ - వినోద్ అద్వ‌య్

పీఆర్ఓ - ఏలూరు శ్రీను

కో డైరెక్ట‌ర్ - ప్ర‌సాద్

డైరెక్ట‌ర్ - బిఎన్ఎస్ రాజు

RavanaLanka Audio Release Details:

RavanaLanka Movie Audio Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs