Advertisement
Google Ads BL

‘ఆదిపురుష్’లో ప్ర‌తినాయ‌కుడు ఎవరంటే..?


రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్

Advertisement
CJ Advs

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ ఎపిక్ విజువ‌ల్ వండ‌ర్ మూవీ ‘ఆదిపురుష్’కి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి ధీటుగా ప్ర‌తినాయ‌కుడు పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ న‌టిస్తున్నారు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం రౌత్(తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఓంరౌత్ గ‌తంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తానాజీ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ఉద‌య్ భాన్ అనే ప్ర‌తినాయ‌క పాత్ర పోషించారు. ఇప్పుడు ఆదిపురుష్ కోసం మ‌రోసారి ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తినాయ‌కునిగా న‌టించ‌బోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఓంరౌత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవ‌లే ఆదిపురుష్ టైటిల్ తో పాటు, ప్ర‌భాస్ ను ఈ చిత్రంలో హీరోగా ప‌రిచయం చేస్తూ అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన చిత్రయూనిట్ తాజాగా సైఫ్ అలీఖాన్‌ను విల‌న్‌గా ప‌రిచ‌యం చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఓంరౌత్ మాట్లాడుతూ.. ‘‘తానాజీ చిత్రంలో ఉద‌య్ భాన్ క్యారెక్టర్‌కి సైఫ్ అలీ ఖాన్ త‌న న‌ట‌న‌తో ప్రాణం పోశారు. ఈ చిత్రంలో సైఫ్ క్యారెక్ట‌ర్ అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఇప్పుడు ఆదిపురుష్‌లో కూడా సైఫ్ పాత్ర చాలా వైవిధ్యంగా విల‌క్ష‌ణంగా ఉండ‌బోతుంది. 7000 ఏళ్ల క్రింద‌ట ఉన్న‌ ఓ తెలివైన రాక్ష‌సుని స్వ‌భావం ప్రేర‌ణ‌గా ఆదిపురుష్‌లో సైఫ్ క్యారెక్టర్ తీర్చిదిద్దుతున్న‌ాం. ఈ చిత్రంలో సైఫ్, ప్ర‌భాస్ మ‌ధ్య క‌త్తి యుద్ధాలు, వీరు ఇద్ద‌రు ఎదురుప‌డిన‌ప్పుడు జ‌రిగే పోరాటాలు అత్యద్భుతంగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.

నిర్మాత భూష‌ణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆది‌పురుష్‌లో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌కి ధీటైన విల‌న్ దొర‌క‌డం చాలా ఆనందంగా ఉంది. తానాజీలో సైఫ్ న‌ట‌న‌, న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. 7000 ఏళ్ల క్రింద‌ట ఉన్న ఓ తెలివైన రాక్ష‌సుడు స్వ‌భావం, తీరు తెన్నుల‌తో ఆదిపురుష్ లో విల‌న్ క్యారెక్ట‌ర్ డిజైన్ చేస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు ఓంరౌత్ చెప్పిన‌ప్ప‌టి నుంచి ఈ పాత్రకు ఎవ‌రైనా స్టార్ హీరో కుదిరితే బాగుంటుంద‌నుకున్నాను. ఈ పాత్ర‌కు సైఫ్ అలీ ఖాన్ ప‌ర్ఫెక్ట్‌గా స‌రిపోతార‌ని నా న‌మ్మ‌కం. ప్ర‌భాస్, సైఫ్ ఆన్ స్క్రీన్ పెర్ఫామెన్స్ ఎలా ఉండ‌బోతుంద‌ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా అన్నారు. ఈ ఎపిక్ డ్రామాను భారీ బ‌డ్జెట్ తో గ్రాఫిక్ హంగులు జోడించి రూపొందిస్తున్న‌ట్లుగా తెలిపారు భూష‌ణ్ కుమార్.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, సైఫ్ అలీ ఖాన్ కన్ఫర్మ్ అయిన ఈ చిత్రానికి

టెక్నికల్ డీటెయిల్స్ 

బ్యానర్: టి సిరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫైల్స్ ప్రొడక్షన్స్ 

సమర్పణ: గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ 

నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్,  ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్

డైరెక్షన్: ఓంరౌత్

Saif to Play Lankesh Role in Adipurush:

Adipurush: The Menacing Villain Unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs