Advertisement
Google Ads BL

నందు బర్త్‌డే స్పెషల్: ‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్’ ఫ‌స్ట్ లుక్


హీరో నందు పుట్టిన‌రోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విశ్వ‌క్ సేన్

Advertisement
CJ Advs

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’‌. ఈ రోజు(గురువారం) నందు పుట్టినరోజు సందర్భంగా నందుని ‘పోతురాజు’గా పరిచయం చేస్తూ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఈ చిత్ర‌ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్‌కి అభిమానిగా న‌టిస్తున్నారు. ఈ క్యారెక్ట‌ర్ చాలా వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా క‌నిపించ‌బోతున్న నందు క్యారెక్ట‌ర్ కి ధీటుగానే హీరోయిన్ ర‌ష్మీ గౌత‌మ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించబోతున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.

న‌టీన‌టులు

నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్

సాంకేతిక వ‌ర్గం

పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైన్స్: ధని ఏలే

ఎడిటర్: బి. సుభాష్కర్

సినిమాటోగ్రఫీ: సుజాతా సిద్ధార్థ్

మ్యూజిక్: ప్రశాంత్ ఆర్. విహారి

నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ

రచన - దర్శకత్వం: రాజ్ విరాట్

Vishwak Sen Launches First look poster of Bomma Blockbuster :

First look poster of Bomma Blockbuster launched on occasion of Nandu birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs