Advertisement
Google Ads BL

సెప్టెంబర్‌ 1న సెట్‌కి సందీప్‌ ఎక్స్‌ప్రెస్‌


సెప్టెంబర్‌ 1న సినిమా సెట్‌కి రావడానికి యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ రెడీ. సుమారు ఐదు నెలల విరామం తర్వాత ఆయన షూటింగ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కరోనాకి ముందు మార్చిలో కొంత చిత్రీకరణ చేశారు. కొవిడ్‌19 కారణంగా విరామం ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

Advertisement
CJ Advs

సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్‌ 1న సెట్‌కి రావడానికి అంతా సెట్‌. ఇప్పుడు చిత్రీకరణ చేయడానికి నేను ఎంత ఎగ్జయిటెడ్‌గా ఉన్నానో, అంతే ఎగ్జయిటెడ్‌గా నాతో ముందడుగు వేస్తున్న నా టీమ్‌కి థ్యాంక్స్‌. అంత డెడికేటెడ్‌ టీమ్‌ ఉండటం అదృష్టం. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి మేం అంతా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. ఈ షెడ్యూల్‌ 15 రోజులు చేస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. షూటింగ్ లొకేషన్ తరచూ శానిటైజ్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చూసుకుంటాం’’ అని అన్నారు. హాకీ అథ్లెట్‌ పాత్ర కోసం ఆయన కఠోరంగా శ్రమిస్తున్నారు. సినిమా కోసం సిక్స్‌ప్యాక్‌ చేశారు. లేటెస్ట్‌గా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్న సందర్భంగా సిక్స్‌ప్యాక్‌ ఫొటోనూ విడుదల చేశారు. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి కథానాయిక. ఆమె సైతం సినిమా కోసం హాకీ ప్రాక్టీస్‌ చేశారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకుడు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. హిప్‌ హాప్‌ తమిళ సంగీత దర్శకుడు. శివా చెర్రీ, సీతారామ్, మయాంక్, దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.

Sundeep Kishan A1 Express on set from September 1:

A1 Express Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs