Advertisement
Google Ads BL

‘వేయి శుభములు కలుగు నీకు’ టైటిల్ పోస్టర్


‘వేయి శుభములు కలుగు నీకు’ సినిమా టైటిల్ పోస్టర్‌ని మరియు మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన హీరో నాని

Advertisement
CJ Advs

జయదుర్గా దేవి మల్టీమీడియా పతాకంపై శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరోహీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. హీరో నాని ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ని మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం పాత్రికేయుల సమావేశంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘‘జయదుర్గా దేవి మల్టీమీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘వేయి శుభములు కలుగు నీకు’ అని నామకారమం చేసారు. హీరో నాగశౌర్య క్లాప్‌తో మొదలైన ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంది. ఈ రోజు ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోను మరియు మోషన్ పోస్టర్‌ను హీరో నాని విడుదల చేసారు, వారికి నా ధన్యవాదాలు. మా అబ్బాయి విజయ్ రాజాకి మంచి నిర్మాత మరియు మంచి దర్శకుడు దొరికారు, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సెప్టెంబర్‌లో వైజాగ్ మరియు అరకు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. నన్ను ఆశీర్వదించి నట్టే నా కుమారుడుని కూడా ఆశీర్వదించండి’’ అని అన్నారు. 

నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ.. ‘‘జయదుర్గా దేవి మల్టీమీడియా బ్యానర్‌పై ఇది మా మొదటి సినిమా. 30 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. సినిమా బాగా వస్తుంది. ఈరోజు సినిమా టైటిల్ ‘వేయి శుభములు కలుగు నీకు’ పోస్టర్‌ను మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన హీరో నానిగారికి ధన్యవాదాలు’’ అని తెలిపారు.

హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి నన్ను హీరోగా పెట్టుకున్న మా దర్శకుడు రామ్స్ రాథోడ్ గారికి మరియు మా నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి నా ధన్యవాదాలు. నెల రోజులుగా కరోనాను జయించి మేము షూటింగ్ చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ డే నాకు, హీరో నాని మా చిత్రం టైటిల్ పోస్టర్ ను మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.

దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘శివాజీ రాజాగారి అబ్బాయి విజయ్ రాజాగారికి ఈ కరోనా టైంలో మాకు డేట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క రోజు గ్యాప్ లేకుండా క్రమశిక్షణతో ఏకధాటిగా షూటింగ్ చేసాము. మా సినిమాకి హీరో నాగ శౌర్య క్లాప్ ఇస్తే, ఈ రోజు హీరో నాని గారు మా చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’ టైటిల్ లోగోను మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు, వారికీ నా ధన్యవాదాలు. మా నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి సినిమాలు అంటే ప్యాషన్. మంచి నిర్మాత దొరికాడు మాకు. ఎక్కడ ఇబ్బంది పడకుండా సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మా సినిమా టైటిల్‌లాగానే ప్రేక్షకులందరూ మా టీమ్‌ని మా సినిమాని లక్షల శుభాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. 

విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్  అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, గడ్డి సుబ్బా రావు, రాజేంద్ర కుమార్, కోట యశ్వంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

కథ, మాటలు: శ్రీనాథ్ రెడ్డి

కెమెరా: కె బుజ్జి

సంగీతం: గ్యాని సింగ్

ఆర్ట్ డైరెక్టర్: బి జగన్

కో డైరెక్టర్: ప్రకాష్

కాస్ట్యూమ్: ఎల్. కిషోర్ కుమార్

ఎడిటర్: వినోద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ

నిర్మాత: తూము నరసింహ పటేల్

కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్స్ రాథోడ్  

Nani Launches Veyi Shubhamulu Kalugu Neeku title poster:

Veyi Shubhamulu Kalugu Neeku title logo and Motion poster launched by Natural Star Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs