Advertisement
Google Ads BL

‘అల వైకుంఠపురములో..’ మళ్లీ అరిపించేసింది


29.4 టిఆర్‌పి రేటింగ్ తో ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ రికార్డ్‌ని స్ట్రాంగ్ చేసిన‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ల ‘అల‌ వైకుంఠ‌పురంలో..’ 

Advertisement
CJ Advs

సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నాన్ భాహుబ‌లి2 గా ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ రికార్డ్‌ని సాధించి తెలుగుసినిమా చ‌రిత్ర‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘అల‌ వైకుంఠ‌పురములో..’. ఈ లాక్‌డౌన్ కొవిడ్ సిట్యూవేష‌న్‌లో అన్ని ఎక్క‌డిక‌క్క‌డ స్థంభించిపోయాయి కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల ప‌రంప‌ర మాత్రం ఏమాత్రం ఆగ‌డం లేదు.. సంవ‌త్స‌రం గ్యాప్ తీసుకుని వ‌చ్చిన‌ అల్లు అర్జున్ త‌న ఫ్యాన్స్ కి సంవ‌త్స‌రాలు మ‌ర్చిపోని గిఫ్ట్‌ని అల‌ వైకుంఠ‌పురములో ద్వారా ఇచ్చాడు. మ్యూజిక్ రికార్డుల‌తో మొద‌లైన ఈ ప‌రంప‌ర థియేట్రిక‌ల్ వ‌సూళ్ళు, ఆన్‌లైన్ యాప్స్‌, యూట్యూబ్ రికార్డ్ సాధిస్తూ ఇప్ప‌టికే పాన్ ఇండియా అంత‌టా ఈ చిత్రం గురించి చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. నేష‌న‌ల్ వైడ్ సెల‌బ్రిటీలు సైతం ట్వీట్స్ చేయ‌టం ఈ చిత్రంపై వున్న క్రేజ్‌ని, అల్లు అర్జున్ ఇమేజ్‌ని తెలియ‌జేస్తుంది. అయితే ఇప్ప‌ుడు టీవీలో అరుదైన కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేయ‌టం విశేషం. సినిమా విడుద‌లై 7 నెల‌లు కావోస్తుంది.. ఓటిటి ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుద‌లై హ‌య్య‌స్ట్ వీవ‌ర్స్ షిప్‌ని సొంతం చేస‌ుకున్న రికార్డ్‌ని నెల‌కొల్పి 6 నెల‌లు కావోస్తుంది. లాక్‌డౌన్ రిలాక్సెష‌న్ నుండి ప్ర‌జ‌లు అన్‌లాక్‌కి వ‌చ్చేశారు. ఈ టైమ్‌లో టీవీలో ‘అల‌ వైకుంఠ‌పురములో..’ చిత్రం టెలికాస్ట్ అయ్యింది. దీనికి తెలుగు ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు. 29.4 టిఆర్‌పి రేటింగ్‌తో గ‌తంలో ఏ చిత్రానికి రాన‌టువంటి అరుదైన రికార్డుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్‌లు సొంతం చేస‌కున్నారు. ప్ర‌ముఖ‌ నిర్మాణ సంస్థ‌లు హారికా హాసిని క్రియేష‌న్స్ అండ్ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై అల్లు అర‌వింద్, కె. రాధాకృష్ణ నిర్మాత‌లుగా నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించారు. థ‌మ‌న్ ఈ చిత్రాల‌కి స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌- మాట‌ల మాత్రికుడు త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్ ఒక మ్యాజిక్‌

‘జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, అల‌ వైకుంఠ‌పురములో’ చిత్రాల‌తో ఆల్‌టైమ్ హ్య‌ట్రిక్ స‌క్స‌ెస్ ని సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల‌ మాత్రికుడు త్రివిక్ర‌మ్. మంచి క‌థకి చ‌క్క‌టి కామెడీ జోడించి ఎమోష‌న్‌గా ప్రేక్ష‌కుడిని సినిమాలోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయించే మ్యాజిక్ వీళ్ళ కాంబినేష‌న్‌కి వుంటుంద‌ని మ‌రొక్క‌సారి అల‌ వైకుంఠ‌పురములో చిత్ర ఘ‌న‌విజ‌యంతో నిరూపితమైంది.

Allu Arjun shatters all time records against all odds :

Ala Vaikunthapurramloo Sets Highest TRP Record
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs