Advertisement
Google Ads BL

‘రాంగ్ గోపాల్ వర్మ’ టైటిల్ లోగో వదిలారు


సంచలన సోషల్ యాక్టివిస్ట్ ‘దేవి’ విడుదల చేసిన రాంగ్ గోపాల్ వర్మ టైటిల్ లోగో

Advertisement
CJ Advs

సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు.

వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహా తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఏ సమాజం కారణంగా తాను మనుగడ సాగిస్తున్నాడో... ఆ సమాజానికి తాను జవాబుదారీ కాదని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకునే వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాల్సి ఉందని ఆమె ప్రకటించారు. ఈ చిత్రం కోసం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన పాట తాను విన్నానని, చాలా బాగుందని ఆమె అన్నారు.

ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని, పతాక సన్నివేశాలు, పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుందని రచయిత-దర్శకనిర్మాత ప్రభు తెలిపారు.

Wrong Gopal Vamra Movie Title Logo Released:

Social Activist Devi Launched Wrong Gopal Vamra Title Logo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs