Advertisement
Google Ads BL

డిటీఎస్ కార్యక్రమాల్లో ‘దేవినేని’


డిటీఎస్ కార్యక్రమాల్లో ‘దేవినేని’ త్వరలో మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. జి.ఎస్.ఆర్ మరియు రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్‌లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబనేపథ్యంలో సెంటిమెంట్‌ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె ఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు.. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూ లో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో ఏం ఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళి గా తేజా రాథోడ్, దేవినేని గాంధీ గా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి అయింది. డిటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ త్వరలో విడుదల కానుంది..’’ అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: నర్రా శివ నాగు

నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్

బ్యాక్గ్రౌండ్ స్కోర్: కోటి

కో.డైరెక్టర్: శివుడు

Devineni Movie Latest Update :

Devineni Movie In DTS Mixing.. Motion poster soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs