Advertisement
Google Ads BL

‘అభిలాష’ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల


మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా ‘అభిలాష’ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా మా చిత్రం ‘అభిలాష’ మోషన్ పోస్టర్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు దర్శకుడు చలువాది శివప్రసాద్ మరియు నిర్మాత సి.హెచ్. శిరీష. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘అభిలాష’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడదే టైటిల్‌తో శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. అమర్ దీప్, అశ్విని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా చిత్రయూనిట్ విడుదల చేశారు. మెగాస్టార్ నటించిన చిత్రాలలోని అద్భుతమైన ఫోజులతో ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారి బర్త్‌డే సందర్భంగా మా ‘అభిలాష’ అనే కొత్త మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలో మెగాస్టార్ చిరంజీవిగారి ‘అభిలాష’లాగే మా ఈ ‘అభిలాష’ చిత్రం కూడా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాము. ఈ మోషన్ పోస్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవిగారికి మా టీమ్ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా ‘అభిలాష’ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

అమర్ దీప్, అశ్విని, ఆశిష్ విద్యార్ధి, కుమరన్ సేతురామన్, అప్పాజి అంబరీష, యస్.డి.జలీల్, గుండు సుదర్శన్, అశోక్ కుమార్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ రాకేష్, ప్రదీప్ రావత్, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రానికి 

బ్యానర్: శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ 

ఫైట్స్: రాబిన్

డ్యాన్స్: రజని

ఆర్ట్: శివ

లిరిక్స్: తిరుపతి జావన, ఈమని వీరేంద్ర

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రామకృష్ణ రాజు

కెమెరా: శివ కమ్మలి

సంగీతం: ఎమ్.ఎమ్. కుమార్

ఎడిటింగ్: రవితేజ కుర్మాన

స్క్రీన్‌ప్లే: పండు చరణ్

పీఆర్వో: వీరబాబు

నిర్మాత: సి.హెచ్. శిరీష

రచన, దర్శకత్వం: చలువాది శివప్రసాద్

Abhilasha Movie Title Motion Poster Released:

Mega Star Birthday special:&nbsp;<span>Abhilasha 2020 Movie title motion poster</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs