‘రాధాకృష్ణ’ ఫస్ట్ సింగిల్ విడుదలచేయనున్న ఇస్మార్ట్ డైరెక్టర్ పూరిజగన్నాథ్.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్ బొమ్మల తాకిడికి కుదుపులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం రాధాకృష్ణ. ప్రముఖ దర్శకుడు ఢమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్, శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకాలపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్ర నిర్మాణ సారథి పుప్పాల కృష్ణ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘రాధాకృష్ణ’ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాణ సారథి కృష్ణ కుమార్ మాట్లాడుతూ - ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కి రెస్పాన్స్ చాలా బాగుంది. అలాగే రాధా కృష్ణ ఫస్ట్ సింగిల్ ను ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఆగస్ట్ 22న విడుదలచేయనున్నారు. డమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి గారి సమర్పణలో అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందుతోంది.. అన్నారు.
అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్), అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఎడిటింగ్: డి.వెంకటప్రభు, ఆర్ట్: వి. ఎన్ సాయిమణి, సమర్పణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సారథ్యం: కృష్ణ కుమార్, నిర్మాత: పుప్పాల సాగరిక, కృష్ణకుమార్, దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.