Advertisement
Google Ads BL

ప్రభాస్ వదిలిన ‘గుడ్‌ ల‌క్ స‌ఖి’‌ టీజర్


కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌ ల‌క్ స‌ఖి’‌. స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా శ‌నివారం ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లాంచ్ చేశారు. త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్‌ను స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళం వెర్ష‌న్ టీజ‌ర్‌ను అక్క‌డి స్టార్ యాక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ చాలా ఆహ్లాద‌క‌రంగా, వినోదాత్మ‌కంగా క‌నిపిస్తోంది. అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల్నీ, ప్ర‌ధానంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోంద‌నే విష‌యం ఈ టీజ‌ర్‌ని చూస్తే అర్థ‌మ‌వుతోంది. హాస్యం పండించే ప‌లు స‌న్నివేశాలు, చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి జోడీ, వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్‌, మంచి డ్రామా, కృషితో ఏ స్థాయికైనా ఎద‌గ‌వ‌చ్చ‌నే అంశం, మ‌న రాత‌ను మ‌న‌మే మార్చుకోవాల‌నే సందేశంతో టీజ‌ర్ ఇంప్రెసివ్‌గా క‌నిపిస్తోంది.

Advertisement
CJ Advs

టీజ‌ర్ ప్ర‌కారం ఏదో బ‌ల‌మైన కార‌ణంతో కీర్తి సురేష్‌ను ఊళ్లో వాళ్లంద‌రూ ‘బ్యాడ్ ల‌క్ స‌ఖి’ అని పిలుస్తుంటారు. అయితే అదేమీ ఆమె ప‌ట్టించుకోదు. ఇప్ప‌టివ‌ర‌కూ అటు ఇంటెన్సిటీ ఉన్న శ‌క్తిమంత‌మైన పాత్ర‌లు, ఇటు సాఫ్ట్ రోల్స్ పోషించి వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారిగా ఇందులో హిలేరియ‌స్ రోల్‌ను పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డిని కీర్తి ‘గోలీ రాజు’ అని పిలుస్తుంటే అత‌డు ఉడుక్కోవ‌డం స‌ర‌దాగా ఉంది. అత‌డితో ‘నువ్ రామారావ్ అయితే, నేను సావిత్రి’ అని కీర్తి అన‌డం ఆక‌ట్టుకుంటోంది. షూటింగ్ ట్రైన‌ర్ జ‌గ‌ప‌తిబాబు, కీర్తి మ‌ధ్య సంభాష‌ణ మోటివేటింగ్‌గా ఉంటే, ఆయ‌న‌తో ‘స‌రే యాడ కాల్చాలా?’ అంటూ పిస్ట‌ల్ ప‌ట్టుకున్న‌ కీర్తి చెప్ప‌డం న‌వ్వులు పండించింది. టీజ‌ర్‌లో రాక్‌స్టార్‌ దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఇచ్చిన‌ మ్యూజిక్ అల‌రించేదిగా ఉండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్ అనిపిస్తోంది. ఎడిటింగ్ షార్ప్‌గా, నిర్మాణ విలువలు ఉన్న‌త స్థాయిలో ఉన్నాయి.

‘గుడ్ ల‌క్ స‌ఖి’పై అంచ‌నాలు టీజ‌ర్‌తో మ‌రింత‌గా పెరిగాయి. నిర్మాత‌ల్లో ఒక‌రైన శ్రావ్య వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అధిక శాతం మ‌హిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వారంద‌రికీ ఇది గ‌ర్వ‌కార‌ణ‌మ‌య్యే సినిమా అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన న‌గేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తోన్న ‘గుడ్ ల‌క్ స‌ఖి’ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళంలో త్రిభాషా చిత్రంగా ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వ‌ర్మ నిర్మిస్తున్నారు. ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మిన‌హా మిగ‌తా ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి.

Click Here for Teaser

ప్ర‌ధాన తారాగ‌ణం:

కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌

సాంకేతిక బృందం:

మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ: చిరంత‌న్ దాస్‌

స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)

నిర్మాత‌: సుధీర్‌చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ

ద‌ర్శ‌క‌త్వం: న‌గేష్ కుకునూర్‌

బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌

Prabhas Launched Keerthy Suresh Good Luck Sakhi Teaser:

Good Luck Sakhi Teaser Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs