Advertisement
Google Ads BL

ఇద్దరు హీరోలతో వేగేశ్న సతీష్ కొత్త చిత్రం!


మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న కథానాయకులుగా వేగేశ్న సతీష్ కొత్త చిత్రం!

Advertisement
CJ Advs

‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో ఇద్దరు కథానాయకులుగా గ్రేట్ యాక్టర్ డా.శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, వేగేశ్న సతీష్ తనయుడు సమీర్ వేగేశ్న నటించనున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై MLV సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించనున్నారు. ఆగస్ట్ 15 దివంగత డా.శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ.. ‘‘వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేశాను. ఇప్పుడు ఓ మంచి పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ మొదలు పెడతాం’’ అని తెలిపారు.

నిర్మాత MLV సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ ‘‘సతీష్‌గారు తీసిన ‘శతమానం భవతి’ చిత్రం నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. హీరోయిన్స్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము..’’ అని తెలిపారు.

Vegesna Sathish next film Announced:

Meghamsh Srihari, Sameer Vegesna to play leads in Vegesna Sathish’s next film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs