Advertisement
Google Ads BL

ఓటీటీ ద్వారా విడుదల సన్నాహాల్లో ‘ప్ర‌ణవం’


చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్ ప‌తాకంపై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి  అయ్య‌ర్  హీరో హీరోయిన్లుగా కుమార్‌ జి. దర్శత్వంలో తనూజ‌.ఎస్‌ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ థ్రిల్ల‌ర్  చిత్రం ‘ప్రణవం’. ప‌ద్మారావ్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని  పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. చాలా కాలం త‌ర్వాత ఇందులో ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్, ఉష క‌లిసి ఓ పాట‌ను పాడ‌టం విశేషం. అలాగే సునీత‌, అనురాగ్ కుల‌క‌ర్ణి పాడిన పాట‌ల‌కు మంచి రెస్పా న్స్ ల‌భిస్తోంది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ  ద్వారా విడుద‌ల‌కు సన్నాహాలు చేసుకుంటోంది.

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ‘‘ఈ రోజుల్లో’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా  ‘ప్ర‌ణవం’ చిత్రం నిర్మించాం. మ‌రో మారు హీరోగా త‌నేంటో నిరూపించుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుడు కుమార్ కి ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ‌ ప్రేక్ష‌కుల ఆలోచ‌నా విధానానికి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కించారు. ప్ర‌జెంట్ కొత్త క‌థ‌ల‌తో పోటీ ప‌డి సినిమాలు చేస్తోన్న ద‌ర్శ‌కుల లిస్ట్ లో మా ద‌ర్శ‌కుడు కుమార్ కూడా చేర‌తారు అన్న న‌మ్మ‌కంతో ఉన్నాం. క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను చాలా రిచ్ గా నిర్మించాం. పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్ర‌ఫీ బాగా కుదిరాయి. ఓటీటీ ద్వారా మా ప్ర‌ణవం చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పిఆర్వో: వంగాల‌ కుమార స్వామి; స్టిల్స్‌: శశాంక్‌ శేఖర్‌; డిఓపి: మార్గల్‌ డేవిడ్‌;  కొరియోగ్రాఫర్‌: అజయ్‌;  కో-డైరక్టర్‌: శ్రావణ్ న‌ల్లూరి; సంగీతం: పద్మనావ్‌ భరద్వాజ్‌; ఎడిటర్‌: సంతోష్‌; ఫైట్స్‌: దేవరాజ్‌; లిరిక్స్‌: కరుణ కుమార్‌, సిహెచ్‌ విజయ్‌కుమార్‌, రామాంజనేయులు; నిర్మాత: తనూజ‌.ఎస్‌; కో- ప్రొడ్యూసర్స్: వైశాలి, అనుదీప్; ద‌ర్శ‌క‌త్వం: కుమార్.జి.

Pranavam film to release on OTT platform:

Youthful Love story film Pranavam is gearing up for release online
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs