Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ వదిలిన ‘కలర్ ఫోటో’ టీజర్!


‘కలర్ ఫోటో’ టీజర్ విడుదల చేసిన హ్యాపెనింగ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ 

Advertisement
CJ Advs

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ చిత్రాలతో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ కలర్ ఫోటో టీజర్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఓ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్న యూనిట్ సభ్యులు, ఇప్పుడు టీజర్ ని కూడా అదే పంధాలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. 

చిత్రం: కలర్ ఫోటో

బ్యానర్: అమృత ప్రొడక్షన్

సమర్పణ: శ్రవణ్ కొంక, 

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్

నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు

నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని

కథ: సాయి రాజేష్ నీలం

ఆర్ట్: క్రాంతి ప్రియం

కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

ఫైట్స్: ఎ.విజయ్

సహ నిర్మాత : మణికంఠ

లైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను

Click Here for Teaser

Vijay Deverakonda Launches Colour Photo Teaser:

Colour Photo Teaser launched by happening hero Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs